డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖ నటుడు అభిషేక్ అరెస్ట్

అభిషేక్‌ను అరెస్ట్ చేసిన యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 26 Sept 2024 5:41 PM IST
Tollywood actor Abhishek arrested in drug case
X

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖ నటుడు అభిషేక్ అరెస్ట్

డ్రగ్స్ కేసులో సినీ నటుడు అభిషేక్ అరెస్ట్ అయ్యారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అభిషేక్ ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఆర్.నగర్, జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిల్లో డ్రగ్స్ కేసుల్లో అభిషేక్ నిందితుడిగా ఉన్నారు.

ప్రస్తుతం ఈ కేసులపై దర్యాప్తు జరగుతుండగా.. బెయిల్ పై బయట ఉన్నారు. కానీ, కోర్టుకు హాజరు కావడం లేదు. హైద్రాబాద్ నుంచి గోవా వెళ్లి అక్కడే ఓ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ వారంట్ తో తెలంగాణ న్యాబ్ పోలీసులు గోవాలో అభిషేక్ ను అదుపులోకి తీసుకున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story