Kangana Ranaut: కంగనా రనౌత్‌కు చంపేస్తానని బెదిరింపులు

Kangana Ranaut: పోలీసులకు ఫిర్యాదు చేసిన కంగనా

Sandeep Eggoju
Published on: 1 Dec 2021 7:00 AM IST
Threats Call to Kangana Ranaut
X

కంగనా రనౌత్ (ఫైల్ ఇమేజ్)

Kangana Ranaut: ముంబయి దాడులపై ఇటీవల తాను చేసిన పోస్ట్‌ విషయంలో హత్యా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై నటి కంగనా రనౌత్ హిమాచల్‌ప్రదేశ్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన ఇన్‌స్టాగ్రాంలో FIR కాపీలను షేర్ చేసింది. ముంబయి ఉగ్రదాడుల తరహా ఘటనల్లో దేశ ద్రోహుల హస్తం ఉందరి, వారు దేశ వ్యతిరేక శక్తులకు సహాయం చేస్తూనే ఉన్నారు అంటూ ఇటీవల పోస్టు చేసింది కంగనా. అయితే అప్పటినుంచి దీనిపై నిరంతరం బెదిరింపులు వస్తున్నాయని, పంజాబ్‌లోని భటిండాకు చెందిన ఓ వ్యక్తి చంపేస్తానని బహిరంగంగా బెదిరించాడని FIRలో పేర్కొంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story