నటించింది నాలుగు సినిమాల్లోనే.. స్టార్ హీరోలను మించి ఆస్తులు ..ఎవరా హీరో?

నటించింది నాలుగు సినిమాల్లోనే.. స్టార్ హీరోలను మించి ఆస్తులు ..ఎవరా హీరో?
x
Highlights

చాలా మంది ఎన్నో కలలు కంటూ సినీఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. ఏదో సాధించాలని వస్తుంటారు. దానికి తగ్గట్లుగానే చాలా కష్టపడుతుంటారు. అయితే ఇండస్ట్రీలో...

చాలా మంది ఎన్నో కలలు కంటూ సినీఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. ఏదో సాధించాలని వస్తుంటారు. దానికి తగ్గట్లుగానే చాలా కష్టపడుతుంటారు. అయితే ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు..దానితోపాటు లక్ కూడా కలిసి రావాలి. కొన్నిసార్లు పలుకుబడి, డబ్బు ఎంత ఉన్నా సరే..అద్రుష్టం లేకనట్లయితే నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఆవిధంగా వేల కోట్లకు అధిపతిగా ఉండి హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఓ నటుడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీశాడు. కానీ ఒక్క సినిమా కూడా సక్సెస్ సాధించలేదు.

ఎవరా హీరో అనుకుంటున్నారు కదా. ఎవరో కాదు సచిన్ జోషి. ఈ హీరో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2002లో వచ్చిన మౌనమేలనోయి మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సచిన్ జోషి. ఆ తర్వాత నిన్న చూడకుండా నేనుండలేను, ఓరెయ్ పండు వంటి సినిమాల్లో నటించాడు. కానీ అన్ని డిజాస్టర్ లుగానే మిగిలాయి. ఓరెయ్ పండు మాత్రం యావరేజ్ గా నడిచింది. నిజానికి సచిన్ లైన్ లోకి వచ్చింది ఓరెయ్ పండు సినిమాతోనే.




అయితే మళ్లీ 9ఏళ్ల వరకు తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఆ మధ్యలో హిందీలో మూడు సినిమాలు చేశారు. ఆషికీ 2 తెలుగు రీమేక్ నీ జతగా నేనుండాలి సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇది కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్టుగా రెండు మూడు సినిమాలు చేశారు. కానీ ఎన్ని సినిమాలు చేసిన సచిన్ మాత్రం హీరోగా నిలవలేదు. తమన్నాతో కలిసి నెక్ట్స్ ఏంటీ సినిమాకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు. సచిన్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ తో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు.

సచిన్ ధనవంతుడు. సచిన్ జోసికి వైకింగ్ గ్రూప్ కంపెనీతోపాటు చాలా వరకు ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. ఆయన ఆస్తులు వేల కోట్లలో ఉంటాయట. హీరోగా సక్సెస్ కాకపోయినా..సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ గా మాత్రం రాణిస్తున్నాడు సచిన్ జోషీ

Show Full Article
Print Article
Next Story
More Stories