
Actress: చిత్ర పరిశ్రమలో రాణించడం అంత సులువు కాదు. సినిమాల్లో అడుగుపెట్టాలంటే అవకాశాలు అందుకోవాలంటే ఎంతో అద్రుష్టం ఉండాల్సిందే. వచ్చిన అవకాశాలు...
Actress: చిత్ర పరిశ్రమలో రాణించడం అంత సులువు కాదు. సినిమాల్లో అడుగుపెట్టాలంటే అవకాశాలు అందుకోవాలంటే ఎంతో అద్రుష్టం ఉండాల్సిందే. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానానికి చేరాలంటే నిరంతరం శ్రమించాల్సిందే. జూనియర్ ఆర్టిస్టులుగా, బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టులుగా చాలా మంది ప్రయాణం మొదలు పెడతారు. అయితే చివరికి శిఖరానికి చేరుకునేది కొందరు మాత్రమే. అందులో కల్కి 2898ఏడీ ఫేమ్ దీపికా పదుకునే కూడా ఒకరు. ఒక్కప్పుడు ఈమె సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా ఉండేది. కానీ ఇప్పుడు టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. రూ. 500కోట్లకు పైగా ఆస్తులతో రిచ్ హీరోయిర్ ల జాబితాలో చేరింది.
దీపికా పదుకునే ఇప్పుడు ఇండియాలో అత్యధిక పారితోషియం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒగరుగా నిలిచింది. ఆమె మొదట సినిమాల్లోకి రావాలనుకోలేదట.ఈ ముద్దుగుమ్మ కెరీర్ హిమేష్ రేషమ్మియా ఆల్బమ్ ఆప్ కా సరూర్ లో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా షురూ అయ్యింది. ఆ సమయంలో దీపికా మోడలింగ్ పై ఫోకస్ పెట్టింది. యాక్టింగ్ పై ఆసక్తి చూపించలేదు. ఆమె తండ్రి బ్యాడ్మింటన్ ఛాంపియన్ ప్రకాశ్ పదుకుణే కూడా ఓ ఇంటర్వ్యూలో దీపికకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ అంటే ఇష్టమని..పాఠశాలలో ఉన్నప్పుడే కొన్ని యాడ్స్ లో కూడా చేసిందని చెప్పాడు. సినిమాలు మాత్రం ఆమె ప్లాన్ లో ఎప్పుడూ లేదని తెలిపారు.
బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునే ముందు దీపిక ఐశ్వర్య అనే సౌత్ ఇండియన్ మూవీలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ కన్నడ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత 2007లో షారుఖ్ ఖాన్ పక్కన ఓ శాంతి ఓం లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ సినిమాతో దీపిక దశ తిరిగింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ర. 148 కోట్లు వసూలు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ హిట్ తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారింది దీపిక.
‘ఓం శాంతి ఓం’ ‘కాక్‌టెయిల్’, ‘యే జవానీ హై దీవానీ’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’, ‘పీకూ’, ‘పఠాన్’, ‘జవాన్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరింది. కేవలం అందంతోనే కాదు, నటనతోనూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచింది. దీపికా భారతదేశంలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటీమణుల్లో ఒగరుగా ఉన్నారు. ఒక్కో సినిమాకి దాదాపు రూ.20 కోట్లు ఛార్జ్ చేస్తుందట.
దీపికా ‘ఛపాక్’ సినిమాలో యాసిడ్ దాడి బాధితురాలిగా నటించిది. ఆ సినిమాలోని లుక్‌ను టిక్‌టాక్ వీడియోలో రీక్రియేట్ చేయమని అడిగి విమర్శల పాలైంది. చాలా మంది దీన్ని ఇన్సెన్సిటివ్‌గా భావించి దీపికపై ఫైర్ అయ్యారు. ఇక ఈ బ్యూటీ ఏకంగా 7 గురితో డేటింగ్ చేసిందని బాలీవుడ్‌లో పలు వెబ్ సైట్‌లలో కథనాలు వచ్చాయి. అందులో నలుగురు సినిమా వాళ్లు, 3 క్రికెటర్‌లు ఉన్నారని రూమర్స్ వచ్చాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




