ఇది నేను ఊహించలేదు.. ప్రభాస్

ఇది నేను ఊహించలేదు.. ప్రభాస్
x
Highlights

ఈ స్టార్ డం తాను ఊహించలేదు సినిమాల్లో హీరోగా వస్తే చాలనుకున్నాను అంటున్నారు రెబల్ స్టార్ ప్రభాస్.

ఈ స్టార్ డం తాను ఊహించలేదు అంటున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ "సినిమాల్లో హీరోగా వస్తే చాలనుకున్నాను. మొదటి సినిమా ఈశ్వర్ సమయంలో మంచి హీరోగా గుర్తింపు వస్తే చాలనుకునేవాడిని. వర్షం సినిమా విజయంతో నేను ఫర్వాలేదు అనుకున్నాను. రాజమౌళి ఛత్రపతి సినిమా విజయం నాలో ఆత్మవిశ్వాశాన్ని పెంచింది. కథలు ఎంచుకోవడంలో నా జడ్జిమెంట్ కరెక్ట్ అనే నమ్మకం కలిగింది. అప్పట్నుంచీ ఒక్కోసినిమాకి మెరుగయ్యాను. ఈ స్థాయి కోసం ఏ రోజూ కలలు కనలేదు'' అంటూ చెప్పారు ప్రభాస్. ఆయన నటించిన ప్రపంచస్థాయి సినిమా సాహో మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ పనుల్లో అయన బిజీగా ఉన్నారు. దానిలో భాగంగా అయన ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విధంగా వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories