మోదీకి ఇవే బహుమతులుగా కావాలట.. ఇచ్చేద్దామా మరి!

PM Modi Birthday Gift : భారత ప్రధాని నరేంద్ర మోడీ నిన్న 70 వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా మోడీకి పలువురు

Krishna
Published on: 18 Sept 2020 2:20 PM IST
మోదీకి ఇవే బహుమతులుగా కావాలట.. ఇచ్చేద్దామా మరి!
X

 Narendra Modi

PM Modi Birthday Gift : భారత ప్రధాని నరేంద్ర మోడీ నిన్న 70 వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా మోడీకి పలువురు సినీ,రాజకీయ, క్రీడా ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.. అయితే మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఎలాంటి బహుమతులు కావాలో చాలా మంది అభిమానులు అడిగారు. అయితే దీనిపట్ల మోడీ స్పందిస్తూ..నాకు మీ నుంచి ఈ బహుమతులే కావాలి అంటూ స్పందించారు..

'ప్రతిఒక్కరూ మాస్కులు ధరించండి. భౌతిక దూరం పాటించండి. ఒకచోట గుమిగూడ వద్దు. మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకోండి. అందరం కలిసికట్టుగా ఈ భూగోళాన్ని ఆరోగ్యకరంగా మార్చుదాం' అంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మోడీ.. ఇక మోడీ తన పుట్టినరోజును వారణాసిలో జరుపుకున్నారు, అక్కడ కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేసి, రాగ్‌పిక్కర్ పిల్లలతో సంభాషించారు.


ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుతూనే ఉన్నాయి. గురువారం నాటికి కరోనా కేసుల సంఖ్య 52,14,678కి చేరుకుంది. ప్రస్తుతం ఇందులో యాక్టివ్ కేసులు 10,17,774 ఉండగా, 41,12,551 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 84,372 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 78.86 శాతంగా ఉంది.

Krishna

Krishna

Next Story