PM Modi 70th BirthDay : ప్రధాని మోదీకి ప్రముఖుల శుభాకాంక్షలు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు 70వ పడిలోకి అడుగు పెట్టారు. తన పుట్టినరోజు నాడు గుజరాత్ లో ఉన్న అమ్మ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం లేదా సాధారణ ప్రజానీకంతో ఉండటం..

Raj
By Raj
Published on: 17 Sept 2020 11:21 AM IST
PM Modi 70th BirthDay : ప్రధాని మోదీకి ప్రముఖుల శుభాకాంక్షలు
X

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు 70వ పడిలోకి అడుగు పెట్టారు. తన పుట్టినరోజు నాడు గుజరాత్ లో ఉన్న అమ్మ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం లేదా సాధారణ ప్రజానీకంతో ఉండటం ఆయనకు అలవాటు.. అయితే ఈసారి కరోనా వైరస్ కారణంగా ఈసారి తన పుట్టిన రోజును మామూలుగానే నిర్వహించుకోవాలని మోదీ నిర్ణయించుకున్నారు. అందువల్ల కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. మరోవైపు మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధానికి సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.

అద్భుతమైన పాలనతో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారని రష్యా అధ్యక్షుడు పుతిన్ కొనియాడారు. నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ కూడా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అందులో ఇలా పేర్కొన్నారు..' ప్రధాని మోదీజీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని.. ఎల్లప్పుడు ఆయురారోగ్యంతో ఉండాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.' అంటూ ట్వీట్‌ చేశారు. అలాగే ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Raj

Raj

Next Story