Ram Gopal Varma: వివేక హత్య కేసులో ఇదే నిజం.. వర్మ ఇంట్రెస్టింగ్ అప్ డేట్..

This is the Real Truth Behind the YS Viveka Murder Says Ram Gopal Varma
x

Ram Gopal Varma: వివేక హత్య కేసులో ఇదే నిజం.. వర్మ ఇంట్రెస్టింగ్ అప్ డేట్..

Highlights

Ram Gopal Varma: సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరో బాంబ్ పేల్చాడు.

Ram Gopal Varma: సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరో బాంబ్ పేల్చాడు. ఏదైనా అంశంపై తనదైన రీతిలో ఔట్ ఆఫ్ ది బాక్స్ కామెంట్ చేసే ఆర్జీవీ నిజం పేరుతో యూట్యూబ్ ఛానెల్ ను ఓపెన్ చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన హై ప్రొఫైల్ పొలిటికల్ మర్డర్ కేస్ వైఎస్. వివేకానంద హత్యోదంతంపై ఉంటుందని అనౌన్స్ చేశాడు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుందని..వివేక హత్య వెనుక నిజంలో అబద్ధముందా అనే టైటిల్ తో ఈ ఎపిసోడ్ ప్రసారం అవుతుందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

వివేకా హత్య వెనుక నిజంలోని అబద్ధాలు, ఆ అబద్ధాలు చెప్పే వాళ్ల వెనక ఉన్న నిజాలు, ఆ నిజాల వెనుక వేరే వాళ్లు ప్రబోధిస్తున్న అబద్ధపు నిజాలు..ఇంకా వాళ్లకు పైవాళ్లు బలవంతంగా అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలు ...వీటన్నింటి వెనుక దాగిన అసలు నిజాలను తవ్వి తీస్తానంటూ ఆర్జీవీ చెప్పాడు. అంతేకాదు అబద్ధాల బట్టలు ఊడదీయడానికే తాను నిజం ఛానెల్ ను స్టార్ట్ చేస్తున్నానని చెప్పాడు. నిజాన్ని చేధించేందుకు లాజికల్ థింకింగ్ ఒకటే సాధనమన్న ఆర్జీవీ...మోటివ్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తే నిజాన్ని అబద్ధం నుంచి కాపాడవచ్చని అభిప్రాయపడ్డాడు.

తన నిజం ఛానల్ లో పొలిటికల్ కాంట్రవర్సీస్ మాత్రమే కాకుండా కొన్ని కరెంట్ టాపిక్స్ ని, సైన్స్ , హిస్టరీ, ఏఐ, క్రైం, న్యాయస్థానాలు ఇంకా ఎన్నో టాపిక్స్ ను కవర్ చేస్తానన్నాడు. మొత్తానికి, నిజం ఛానల్ ఎలా ఉంటుందో చెబుతూ ఆర్జీవీ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో వర్మ ఎలాంటి నిజానిజాలు బయటకు తీసుకువస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories