Gayatri Sainath : సినీ నటి ఇంట్లో బంగారం దొంగతనం.. నర్సు చేతివాటం!

Gayatri Sainath : తమిళ సినీ నటి గాయిత్రి గోపీనాథ్ ఇంట్లో బంగారం దొంగతనం జరిగింది. ఏకంగా 111 గ్రాముల బంగారం చోరీ కావడంతో ఆమె

Krishna
Published on: 5 Sept 2020 1:23 PM IST
Gayatri Sainath : సినీ నటి ఇంట్లో బంగారం దొంగతనం.. నర్సు చేతివాటం!
X

Gayatri Sainath

Gayatri Sainath : తమిళ సినీ నటి గాయిత్రి సాయినాథ్ ఇంట్లో బంగారం దొంగతనం జరిగింది. ఏకంగా 111 గ్రాముల బంగారం చోరీ కావడంతో ఆమె పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే ఆమె ఇంట్లో పనిచేస్తున్న నర్సు ఈ దొంగతనం చేయడంతో ఆమెను పొలిసులు అరెస్ట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాయపేటలోని లయిడ్స్‌ రోడ్డు వీధిలో నటి గాయత్రి సాయినాథ్‌ తన తల్లితో కలిసి నివసిస్తున్నారు. అయితే ఆమె తల్లి వృద్ధురాలు కావడంతో ఆమెకి సపర్యలు చేయడానికి స్థానికంగా శివకామి అనే నర్సును ఏర్పాటు చేసుకున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఆ నర్సు 111 గ్రాముల బంగారం చోరీ చేసింది. దీంతో నటి గాయత్రి సాయినాథ్‌ రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. చుట్టూ పక్కల సీసీటీవీ కెమెరాల ఆధారంగా కేసును చేధించిన పోలీసులు నటి ఇంట్లోని నర్సు ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె నిజం ఒప్పుకోగా, అయితే ఆ బంగారాన్ని తాకట్టు పెట్టినట్టుగా వెల్లడించింది. అనంతరం ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకొని నటి గాయత్రి సాయినాథ్‌ కి అందజేశారు.

ఇక గాయత్రి ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన అంజలి చిత్రంతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు.

Krishna

Krishna

Next Story