OTT Movie: ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా.? ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు..!

OTT: ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా.? ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు
x

OTT: ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా.? ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు

Highlights

OTT Movie: సాధారణంగా టీవీ షోలు, సీరియల్స్ కోసం నిర్మాతలు పెద్ద బడ్జెట్ ఖర్చు చేయరు. సినిమాలతో పోలిస్తే వీటి కోసం సెట్లు, లొకేషన్లు ఇలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు.

OTT Movie: సాధారణంగా టీవీ షోలు, సీరియల్స్ కోసం నిర్మాతలు పెద్ద బడ్జెట్ ఖర్చు చేయరు. సినిమాలతో పోలిస్తే వీటి కోసం సెట్లు, లొకేషన్లు ఇలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. కానీ ఓటీటీలు వచ్చాక మాత్రం ఈ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు నిర్మాతలు భారీ బడ్జెట్‌తో ఓటీటీ వెబ్ సిరీస్‌లు రూపొందిస్తున్నారు.

ఇందుకు నిదర్శనమే ‘ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఓటీటీ సిరీస్‌గా దీనికి పేరొచ్చింది. జేఆర్ఆర్ టోల్కీన్ రచించిన పాపులర్ నవల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్, అప్పటివరకు వచ్చిన బాహుబలి, RRR, ఆదిపురుష్, కల్కి2898AD వంటి ఇండియన్ బిగ్ బడ్జెట్ సినిమాల ఖర్చును మించి పోయింది.

ఈ సిరీస్‌ తొలి సీజన్‌కు ఖర్చయిన మొత్తం బడ్జెట్ దాదాపు 1 బిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.8300 కోట్లు) అని అంచనా. ఇందులో కేవలం షూటింగ్ కోసమే 465 మిలియన్ డాలర్లు (రూ.3800 కోట్లు) ఖర్చయినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అంటే ఒక్క ఎపిసోడ్‌కే సుమారు రూ.480 కోట్లు. ఈ మొత్తానికి మన దేశంలో మూడు పెద్ద సినిమాలు తీయొచ్చు.

ఈ సిరీస్ 8 ఎపిసోడ్లతో విడుదలైంది. హై క్వాలిటీ విజువల్స్, గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్, సెట్స్ అన్నీ క‌లిపి బడ్జెట్‌కి న్యాయం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకుముందు ప్ర‌పంచంలో అత్యధిక ఖర్చుతో వచ్చిన మూవీ స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్, దాదాపు 447 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో వచ్చింది. అంతకు ముందే వచ్చిన ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రయోలజీ మొత్తం 260 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తీశారు. అలాంటి కంటెంట్ మీదే వచ్చిన ఈ తాజా వెబ్ సిరీస్ మాత్రం కొత్త రికార్డు నెలకొల్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories