Tempt Raja Trailer: ఇదేం ట్రైలర్ బాబోయ్.. 'చితక్కొట్టుడు'ని మించిపోయింది

Tempt Raja Trailer: ఇదేం ట్రైలర్ బాబోయ్.. చితక్కొట్టుడుని మించిపోయింది
x
టెంప్ట్ రాజా 
Highlights

యువతరాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న టాలీవుడ్ సినిమాల్లొ శృతిమించిన శృంగార దృశ్యలను చూపించడం సర్వసాధారణం అయింది

యువతరాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న టాలీవుడ్ సినిమాల్లొ శృతిమించిన శృంగార దృశ్యలను చూపించడం సర్వసాధారణం అయింది. ఇప్పటికే ఇలాంటి సినిమాలు కొకొల్లలు వచ్చాయి. . ఇప్పుడు అదేబాటలో 'టెంప్ట్ రాజా' అంటూ అడల్ట్ కంటెంట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లో వ్యూస్ పరంగా జెట్ స్పీడులో దూసుకుపోతోంది.

సే క్రియేషన్స్ బ్యానర్‌పై ఏఆర్కె ఆర్ట్స్ సమర్పణలో రాంకీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోగా రాంకి, ఫస్ట్ హీరోయిన్‌గా దివ్య రావు, సెకండ్ హీరోయిన్‌గా ఆస్మ నటించగా.. పోసాని కృష్ణ మురళి, యాంకర్ శ్యామల, టార్జెన్, జయవాణి, జోగి బ్రదర్స్ (కృష్ణ, నాయుడు) గౌతంరాజు, అశోక్ కుమార్, మేఘన చౌదరి, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ దొరబాబు, మైత్రి రజిత, దీప్తి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

ఈ సందర్భంగా హీరో మరియు నిర్మాత రాంకి (వీర్నాల రామకృష్ణ) మాట్లాడుతూ..ఇప్పటికే విడుదల చేసిన సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్లు దివ్య రావ్డ డిగ్రీ (కాలేజ్ ఫేమ్), ఆస్మలు చాలా బాగా నటించారు. 'Tempt రాజా' సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్‌గా యూత్‌ని అలరిస్తుంది. ఇప్పుడు టీజర్‌కి ఇంకా బాగా రెస్పాన్స్ వస్తోంది అని నిర్మాత చెప్పారు

ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి ఎంతో బిజీగా ఉన్నా సినిమాలో నటించేందుకు ముందుకు వాచ్చారన్నారు. ఆయన చేసిన కామెడీ సినిమాలో హైలైట్ అవుతుంది. ఇది మహిళల ఇమేజ్‌ని పెంచే ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా. రొమాన్స్ విషయంలో మహిళల ఫీలింగ్స్ ఎంటనేది చాలా సున్నితంగా తెరమీద చూపించాం'' అన్నాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories