Serial actor Ravi Krishna tested corona positive : మరో బుల్లితెర నటుడికి కరోనా!

Serial actor Ravi Krishna tested corona positive : కరోనా ఎవరిని వదలడం లేదు.. సామన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరి పైన తన ప్రభావం చూపిస్తోంది.

Krishna
Updated on: 4 July 2020 10:31 PM IST
Serial actor Ravi Krishna tested corona positive : మరో బుల్లితెర నటుడికి కరోనా!
X

Serial actor Ravi Krishna tested corona positive : కరోనా ఎవరిని వదలడం లేదు.. సామన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరి పైన తన ప్రభావం చూపిస్తోంది. తాజాగా కరోనాతో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ పోకూరి రామరావు (64) మృతి చెందారు. ఇక బుల్లితెర నటులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ప్రభాకర్, నవ్య మొదలగు నటులకి కరోనా సోకిన సంగతి తెలిసిందే.. తాజాగా బిగ్‌బాస్‌-3తో పాపులర్‌ అయిన రవికృష్ణకు కుడా కరోనా సోకింది. ఈ విషయాన్ని రవికృష్ణననే తన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు.

ఇటీవల తానూ కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో కరోనా పాజిటివ్‌ అని తేలిందని, దీనితో గత మూడు రోజులు నుంచి ఇంట్లోనే ఉంటున్నట్లుగా వెల్లడించాడు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పుకొచ్చాడు. కొన్ని రోజుల నుంచి తనను కాంటాక్ట్‌ అయిన వారు ఇంట్లోనే ఉండి వీలైతే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పేర్కొన్నాడు.

కరోనా వలన ఆగిపోయిన బుల్లితెర, వెండితెర షూటింగ్ లకి తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొన్ని గైడ్ లైన్స్ రూపొందించి షూటింగ్ లకి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే రవికృష్ణ నటిస్తున్న ఆమె కథ అనే సీరియల్ మొదలైంది.. ఇక ఈ సీరియల్‌ నటి నవ్య స్వామి కూడా కరోనా బారిన పడగా, ప్రస్తుతం ఆమె కూడా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక రవికృష్ణ, నవ్య కలిసి ఇదే సీరియల్ లో కలిసి నటిస్తున్నారు. ఆ సీరియల్‌ నుంచి ఇద్దరు నటులు కరోనా బారిన పడటంతో మిగతా యూనిట్‌ సభ్యులలో ఆందోళన మొదలైంది.

ఇక ఇటు తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,850 కొరొనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 22,312కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,487 యాక్టివ్ కేసులు ఉండగా, 11 537 మంది డిచార్జ్ అయ్యారు. అటు కరోనాతో 288 మంది చనిపోయారు.

Krishna

Krishna

Next Story