Eesha Rebba Twitter : ఈషా రెబ్బా ట్విటర్ అకౌంట్ హ్యాక్

Eesha Rebba Twitter : నటి ఈషా రెబ్బా ట్విటర్ అకౌంట్ ని ఎవరో హ్యాక్ చేశారు.. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.. ప్రస్తుతం ఆమె అకౌంట్

Krishna
Published on: 18 Aug 2020 3:36 PM IST
Eesha Rebba Twitter : ఈషా రెబ్బా ట్విటర్ అకౌంట్ హ్యాక్
X
Eesha Rebba (File Photo)

Eesha Rebba Twitter : నటి ఈషా రెబ్బా ట్విటర్ అకౌంట్ ని ఎవరో హ్యాక్ చేశారు.. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.. ప్రస్తుతం ఆమె అకౌంట్ మొత్తం ఖాళీ అయింది.. ప్రస్తుతం ఆ అకౌంట్ ని ఓపెన్ చేస్తే మీ అకౌంట్‌ లేదు అని చూపిస్తోందని ఈషా ఇన్‌స్టా గ్రామ్ లో వెల్లడించింది. ప్రస్తుతం ట్విట్టర్ హెల్ప్ టీం కి చెప్పగా టెక్నికల్ టీమ్‌ దీన్ని పరిశీలిస్తున్నట్ల తెలుస్తోంది.. ఇక ఈషా రెబ్బా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలని అందులో పోస్ట్ చేస్తూ ఉంటుంది ఈషా రెబ్బా.. ఇక సెలబ్రిటీల అకౌంట్స్ హ్యాక్ అవ్వడం అనేది కొత్తేమి కాదు. గతంలో చాలా మంది సెలబ్రిటీల అకౌంట్లు హ్యాక్ అయిపోయాయి.. తాజాగా సింగర్ స్మిత అకౌంట్‌ని హ్యాక్ చేశారు హ్యాకర్లు..

2013లో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన అంతకు ముందు... ఆ తరువాత చిత్రంతో వెండితెరకి పరిచయం అయింది ఈషా రెబ్బా.. ఆ తర్వాత బందిపోటు, అమి తుమి, దర్శకుడు చిత్రాలలో నటించింది. ఇక ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. వీటితో ఆశించినన్ని అవకాశాలు అయితే ఈ అమ్మడికి రాలేదు అని చెప్పాలి.. ప్రస్తుతం ఈషా పలు వెబ్‌ సిరీస్‌లలో నటిస్తోంది. హిందీలో మంచి విజయం సాధించిన లస్ట్ స్టోరీస్‌ తెలుగు రీమేక్‌లో ఈషా కనిపించనుంది.

Krishna

Krishna

Next Story