దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు తెలంగాణ హైకోర్టు షోకాజ్ నోటీసులు

Arun Chilukuri
Published on: 24 Nov 2020 3:38 PM IST
దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు తెలంగాణ హైకోర్టు షోకాజ్ నోటీసులు
X

సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు తెలంగాణ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దిశ ఎన్‌ కౌంటర్‌పై వర్మ తీస్తున్న సినిమాను నిలిపివేయాలని కోరుతూ నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టు ఆశ్రయించారు. నిందితుల కుటుంబ సభ్యులు ఇప్పటికే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని నిందితుల తరపు న్యాయవాది కృష్ణా మూర్తి కోర్టులో పిటిషన్‌ వేశారు.

చిత్రంలో నిందితులను దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. సినిమా విడుదలైతే వారిని ఊరిలో కూడా ఉండనీయరన్నారు. చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరారు. జ్యుడీషియల్‌ కమిషన్‌ విచారణ జరుగుతుంటే సినిమాను ఎలా నిర్మిస్తారని కృష్ణా మూర్తి ప్రశ్నించారు. వర్మకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story