Teja Sajja : శివానీ రాజశేఖర్‌ తో తేజ సజ్జ... ఫస్ట్ లుక్‌ రిలీజ్‌

Teja Sajja : శివానీ రాజశేఖర్‌ తో తేజ సజ్జ... ఫస్ట్ లుక్‌ రిలీజ్‌
x

shivani, Teja Sajja 

Highlights

Teja Sajja : గత ఏడాది యాంగ్రీ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక దొరసాని సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాతో టాలెంటెడ్...

Teja Sajja : గత ఏడాది యాంగ్రీ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక దొరసాని సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాతో టాలెంటెడ్ హీరోయిన్ ఇండస్ట్రీకి దొరికినట్టేనని అందరూ అనుకున్నారు... ప్రస్తుతం శివాత్మిక రెండు సినిమాలతో బిజీగా వుంది.. ఇక రాజశేఖర్ జీవితల మొదటి కుమార్తె శివాని ఎంట్రీ కూడా ఫిక్స్ అయిపోయింది. ఆమె బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆమె న‌టిస్తున్న తొలి చిత్రం మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు మేకర్స్.. ఆమె లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. వెన్నెల అనే పాత్రలో శివానీ కనిపిస్తుంది. కానీ ఇంకా ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేయలేదు..

ఇక ఈ మూవీలో హీరోగా నటిస్తున్న ఓ బేబీ ఫేం తేజ లుక్ రిలీజైంది. ఆదివారం తేజ పుట్టిన రోజు కావడంతో మేకర్స్ అతని లుక్ ను రివీల్ చేశారు. ఈ లుక్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఈ మూవీకి మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తుండగా మహతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి నిర్మిస్తున్నారు. ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తేజ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు.. ప్రస్తుతం షూటింగ్ మొత్తం కంప్లీట్ కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కరొనా నుంచి పరిస్థితులు చక్కబడ్డాక సినిమాని రిలీజ్ చేయనున్నారు.

అటు దర్శకుడు ప్రశాంత్ వర్మ మూడో చిత్రంగా తెరకెక్కుతున్న జోంబీ రెడ్డిలో తేజ సజ్జ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు..ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్.. మోషన్ పోస్టర్‌లోకి వస్తున్న తేజ తన షర్ట్ వెనుక మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌తో కనిపించడం విశేషం..





Show Full Article
Print Article
Next Story
More Stories