విజయసాయి రెడ్డికి బుద్ధా వెంకన్న కౌంటర్!

విజయసాయి రెడ్డికి బుద్ధా వెంకన్న కౌంటర్!
x

Buddha Venkanna

Highlights

Buddha Venkanna Comments On Vijaya Sai Reddy : గత ప్రభుత్వ పాలనలో ప్రజల డబ్బులను టీడీపీ అధినేత చంద్రబాబు దుబారా చేశారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Buddha Venkanna Comments On Vijaya Sai Reddy : గత ప్రభుత్వ పాలనలో ప్రజల డబ్బులను టీడీపీ అధినేత చంద్రబాబు దుబారా చేశారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అయితే విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకి టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.. ఈ మేరకు అయన వరుస ట్వీట్లు చేశారు. " 43 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేసి,16 నెలలు చిప్పకూడు తిన్న వైఎస్ జగన్ గారిని విజన్ ఉన్న నాయకుడు అంటారా విజయసాయి రెడ్డి? పోలవరం యాత్రకు ధనం వృధా చేసి ఉంటే మీ సైకో బ్యాచ్ ఊరుకుంటుందా ?పోలవరం అనేది 7 దశాబ్దాల రాష్ట్ర ప్రజల కల..70 శాతం చంద్రబాబు గారు పూర్తి చేసారు కాబట్టి కల సాకారం అవుతున్న దృశ్యాన్ని ప్రజలకు చూపించారు. ఇక మీ లాగా ఢిల్లీ వాళ్లకు 'ఫుట్ మసాజ్' చేయకుండా, రాష్ట్ర సమస్యలపై కేంద్రంతో పోరాడారు' అని ఆయన ట్వీట్ చేశారు.


అంతేకాకుండా " స్కూల్ పిల్లలు వేసుకునే బెల్ట్ కి, సాక్స్ కి వైసీపీ పార్టీ వరంగులు వేసుకునే నువ్వు దుబారా గురించి మాట్లాడుతున్నావా?అన్నట్టు 4 వేల కోట్ల తో పంచాయతీలకు వైకాపా రంగుల దుబారా మర్చిపోయావా?తాడేపల్లి ఇంటి కోసం రూ.16 కోట్లు,నాయన సమాధి కోసం రూ.27 కోట్లు, చచ్చు సలహాలు ఇచ్చే సలహాదారులకు 60 కోట్లు సిబిఐ కోర్టుకు వెళ్లడానికి ప్రతీ వారం 60 లక్షలు, మీ కక్షలు తీర్చుకోవటానికి లాయర్ల ఫీజులంటూ వందల కోట్లు, మీ అవినీతి పత్రికకు వందల కోట్లు,మీరు చేసే వేల కోట్ల దందాలు,మొత్తం లెక్క తీస్తే, 10 పోలవరం ప్రాజెక్ట్లు కట్టవచ్చు" అంటూ ట్వీట్లు చేశారు బుద్ధా వెంకన్న.. మరి బుద్ధా వెంకన్న వ్యాఖ్యల పట్ల విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి!

Show Full Article
Print Article
Next Story
More Stories