జగన్ పాలన బాగుందని ఒక్కరు చెప్పినా రాజకీయల నుంచి తప్పుకుంటా : బుద్దా వెంకన్న సవాల్

Arun Chilukuri
Updated on: 2 Jun 2020 3:28 PM IST
జగన్ పాలన బాగుందని ఒక్కరు చెప్పినా రాజకీయల నుంచి తప్పుకుంటా : బుద్దా వెంకన్న సవాల్
X
Budda venkanna (file photo)

విజయసాయి రెడ్డి విఫలసాయి రెడ్డిగా మారారని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సి బుద్దా వెంకన్న. జడ్జిలను దూషించిన వారిని కాపాడతానని విజయసాయి చెప్పడం సరికాదన్నారు. రాజ్యసభ ఎంపీ పదవికి విజయసాయి అనర్హుడని, సీఎం జగన్ తో విజయసాయి రెడ్డికి గ్యాప్ వచ్చిందని ఆరోపించారు.

సీఎం జగన్ కారులో నుంచి దించేశాక విజయసాయిలో మార్పొచ్చిందని ఎద్దేవా చేశారు. చచ్చేదాకా పార్టీలోనే ఉంటానని విజయసాయి చెప్పారంటే జగన్ ఆయన్ను పక్కన పెట్టారని స్పష్టమవుతోందని చెప్పారు. మిడతలు పంటను నాశనం చేస్తుంటే విజయసాయి అండ్ గ్యాంగ్ విశాఖను నాశనం చేస్తున్నాయిని ధ్వజమెత్తారు.

వైసీపీలో అంతర్గత విభేదాలు తలెత్తాయి. వైసీపీ సోషల్ మీడయాను తాను చూసుకుంటానని విజయసాయి అంటున్నారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా మురికి గుంట అని సజ్జల అంటున్నారని పేర్కొన్నారు.

వైసీపీ ఏడాది పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. జగన్ పాలన బాగుందని ఒక్కరితో చెప్పించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. విజయసాయి భూ కబ్జాలతో విశాఖ విలవిలలాడుతోందని ఉత్తరాంధ్రను విజయసాయి రెడ్డి దోచేస్తున్నారని బుద్ధ వెంకన్న ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story