Taraka Ratna: ప్రజలు, అభిమానుల సందర్శనార‌్థం ఫిల్మ్‌ఛాంబర్‌కు పార్థివదేహం

Taraka Ratna: కాసేపట్లో ఫిల్మ్‌‍ఛాంబర్‌కు తారకరత్న భౌతికకాయం

Dhatripriya
Updated on: 20 Feb 2023 1:13 PM IST
Tarakaratna Will Be Send To Filmchamber
X

Taraka Ratna: ప్రజలు, అభిమానుల సందర్శనార‌్థం ఫిల్మ్‌ఛాంబర్‌కు పార్థివదేహం

Taraka Ratna: 23 రోజులు మృత్యువుతో పోరాడి... బెంగళూరు నారాయణ హృదయాలయలో మరణించిన నందమూరి తారకరత్న అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నారు. భౌతికకాయాన్ని చూసేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు, బంధువులు, అభిమానులు పెద్దసంఖ్యలో చేరుకొని తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. తారకరత్న భౌతికకాయాన్ని కాసేపట్లో ఫిల్మ్‌ఛాంబర్‌కు తీసుకురానున్నారు. మోకిలలోని నివాసం నుంచి ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలిస్తారు. అనంతరం అక్కడ పలువురు తారకరత్న పార్థివదేహానికి నివాళులర్పించనున్నారు. మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తారకరత్న కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ నటులు, దర్శకులు విచారం వ్యక్తం చేశారు. తారకరత్న లేరన్న విషయం నమ్మలేకపోతున్నానని, మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అలనాటి నటుడు ఎన్టీఆర్‌ కుమారుడు మోహన్‌కృష్ణ తనయుడు తారకరత్న. 1983 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో తారకరత్న జన్మించారు. అలేఖ్య రెడ్డిని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 20 ఏళ్ల వయసులోనే కథానాయకుడిగా తారకరత్న తెరంగ్రేటం చేశారు. కాలేజీలో చదువుతున్న సమయంలోనే నటనపై ఉన్న ఆసక్తితో.. 2002లో విడుదలైన 'ఒకటో నెంబర్‌ కుర్రాడు'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా విజయం సాధించడంతో తారకరత్నకు వరుస అవకాశాలు వచ్చాయి. అలా, ఆయన హీరోగానే కాకుండా విలన్‌, సహాయ నటుడిగానూ నటించి విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. యువరత్న, భద్రాద్రి రాముడు, అమరావతి, నందీశ్వరుడు వంటి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 'అమరావతి' చిత్రానికి గానూ ఉత్తమ విలన్‌గా నంది అవార్డును అందుకున్నారు. ఇటీవల '9 అవర్స్‌' వెబ్‌ సిరీస్‌లో నటించి.. ప్రేక్షకుల్ని అలరించారు. తారకరత్న తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనేవారు. గతంలో పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం కూడా చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story