మీకేం పొయ్యేకాలం రా బాబు.. బాహుబలి తర్వాతే మీరు.. ఎందుకు కొట్టుకుంటున్నారు?

మీకేం పొయ్యేకాలం రా బాబు.. బాహుబలి తర్వాతే మీరు.. ఎందుకు కొట్టుకుంటున్నారు?
x
Highlights

సంక్రాంతికి ఒకరు మొగుడ్ని వచ్చాను అంటూ రంగంలోకి దిగితే, మరొకరు ***మొగుడ్ని వచ్చాను అంటూ ముతక డైలాగు తో సై అన్నారు. సినిమా ఎలా ఉంది అన్నరోజులూ.. సినిమా...

సంక్రాంతికి ఒకరు మొగుడ్ని వచ్చాను అంటూ రంగంలోకి దిగితే, మరొకరు ***మొగుడ్ని వచ్చాను అంటూ ముతక డైలాగు తో సై అన్నారు. సినిమా ఎలా ఉంది అన్నరోజులూ.. సినిమా ఎన్నిరోజులు ఆడుతుంది అనే లెక్కలూ పోయాయి. రోజుకి ఎంత వసూలు చేసింది అనేదే మిగిలింది. సినిమా చెత్తగా ఉన్నా సొమ్ములు వచ్చాయా లేదా అన్నదే ప్రధానంగా టాలీవుడ్ వ్యాపారం మారిపోయింది. ప్రేక్షకుల అభిప్రాయానికి విలువే లేదు.

ఎందుకంటే.. ప్రతి సినిమా మొదటి వారం.. మరీ ముఖ్యంగా మొదటి మూడు నాలుగు రోజులు వేలాది స్క్రీన్లలో ఇంకా చెప్పాలంటే.. దాదాపు అన్ని స్క్రీన్లలో ప్రదర్శించేస్తారు. కొంచెం పెద్ద హీరోల సినిమాలకైతే..ఎగస్ట్రా ధరలూ.. ఎగస్ట్రా షో లు మామూలే. ఈ నేపధ్యంలో సాధారణంగానే కలెక్షన్లు మొదటి వారం మోత ఎక్కిస్తాయి. మరీ దరిద్రంగా చెప్పుకొని వీలులేని సినిమా అయితే తప్ప మొదటి మూడురోజుల్లో సొమ్ములు చాలావరకూ రాబట్టేస్తాయి. ఇక పైన సినిమాకి శాటిలైట్ రైట్లూ గట్రా ఎగస్ట్రా. ఇదంతా ఎందుకంటే, ఈ సంక్రాంతికి వచ్చిన రెండు పెద్ద హీరోల సినిమాల ప్రచార ధోరణిలో కనిపించిన వైపరీత్యం.. దానికి అభిమాన గణం ఒకరిపై ఒకరు చేసుకుంటున్న సోషల్ మీడియా దాడులు తోడై అసలు హీరోలు బాగానే ఉన్నారు. కానీ, ఈ గోల ఎక్కువైపోయింది.

ఈ నేపధ్యంలో ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అల వైకుంఠపురములో.. సరిలేరు నీకెవ్వరు సినిమాల కలెక్షన్ల ప్రచారం పై స్పందించారు. అయన నా ఆలోచనలు పేరుతొ యూ ట్యూబ్ లో తన అభిప్రాయలను నేటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో ఈసారి వెరైటీగా అల్లు అర్జున్, మహేష్ బాబు మాస్కులతో కనిపించారు. మాది కలెక్షన్లలో సూపర్ అంటే మాది అంటూ చెప్పుకుంటున్న రెండు సినిమాల గాలీ తీశేశారు.

మీ రెండు సినిమాలూ ఎంత వసూలు చేసినా బాహుబలి కంటే తక్కువే కదరా బాబు.. మరెందుకు ఇంత హడావుడి అంటూ ప్రశ్నించారు. రెండు సినిమాలు సంక్రాంతికి విడుదల అయ్యాయి. చక్కగా హిట్ కొట్టాయి. రెండూ బావున్నాయని చెబుతున్నారు. ఇంకా ఎందుకు ఈ గొడవంతా. అంతా మంచే జరిగింది కదా అని అయన స్టైల్ లో అయన ప్రశ్నించారు. ఈ వీడియో పై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అయితే, అయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్న వారు ఎక్కువగానే కామెంట్లు పెడుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories