96 Movie Remake: హిందీలో రీమేక్ కాబోతున్న తమిళ సూపర్ హిట్ సినిమా

Tamil Super Hit Movie 96 to be Remake in Hindi by Producer Ajay Kapoor
x

హిందీలో రీమేక్ కాబోతున్నహిట్ సినిమా"96"(ఫోటో-ది హన్స్ ఇండియా)

Highlights

* అజయ్ కపూర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు

96 Movie Remake: విజయ్ సేతుపతి త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ సినిమా "96" తమిళ్ లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అదే సినిమాని దిల్ రాజు తెలుగులో కూడా రీమేక్ చేశారు. శర్వానంద్ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా "జాను" అనే టైటిల్ తో తెలుగులో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారట. గతంలో ఎయిర్ లిఫ్ట్, బేబీ, భూత్ నాథ్ రిటర్న్స్ వంటి సినిమాలను నిర్మించిన అజయ్ కపూర్ "96" హిందీ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు.

ఈ విషయాన్ని అజయ్ కపూర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు స్వయంగా ప్రకటించారు. నిర్మాత అజయ్ కపూర్ విజయ్ సేతుపతి త్రిష హీరోహీరోయిన్లుగా 2018 లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన "96" సినిమా హిందీ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ రొమాంటిక్ డ్రామా ఒరిజినల్ సినిమా కలిగించిన మ్యాజిక్ ని రీక్రియేట్ చేయబోతోంది అంటూ ప్రకటించిన నిర్మాణ సంస్థ ఈ సినిమాకి సంబంధించి నా దర్శకుడు మరియు నటీనటుల వివరాలను త్వరలో విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories