Balakrishna: బాలయ్య సినిమాలో నటించనున్న తమిళ స్టార్ హీరో

Tamil Hero Vijay Sethupathi Going to be Act in Balakrishna Movie
x

నందమూరి బలలక్రిష్ణ సినిమాలో నటించనున్న తమిళ హీరో (ఫైల్ ఇమేజ్)

Highlights

Balakrishna: బాలయ్య కోసం కోలీవుడ్ స్టార్లను రంగంలోకి దింపిన గోపిచంద్ మలినేని

Balakrishna: "సింహా", "లెజెండ్" వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ "అఖండ" అనే సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా గోపీచంద్ మలినేని ఈ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేయడంలో బిజీ అయ్యారు.

తాజా సమాచారం ప్రకారం దర్శకనిర్మాతలు ఈ సినిమా కోసం ఇద్దరూ కోలీవుడ్ స్టార్లను రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి మరియు వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ఉన్న ఈ ఇద్దరూ నటులు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితులే. వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పటికే ఈ సినిమా కోసం సైన్ చేయగా విజయ్ సేతుపతి మాత్రం ప్రస్తుతం ఈ సినిమా కోసం డేట్లు చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చే ఏడాది సమ్మర్ విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories