మంజుభార్గవి తో ప్రముఖ కమెడియన్ యోగిబాబు వివాహం

K V D Varma
Published on: 5 Feb 2020 1:51 PM IST
మంజుభార్గవి తో ప్రముఖ కమెడియన్ యోగిబాబు వివాహం
X

ప్రముఖ తమిళ కమెడియన్ యోగిబాబు వివాహం బుధవారం జరిగింది. అతి కొద్ది మంది ఆహ్వానితుల మధ్యలో ఈ వివాహం జరిగినట్టు తమిళ మీడియా వెల్లడించింది. తమిళనాడులోని వేల్లూరుకు చెందిన మంజుభార్గవి తో అయన పెళ్లి జరిగింది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అనీ, సినీ రంగానికి చెందినా ఎవరినీ ఆహ్వానించలేదానీ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే ఈ వివాహానికి సంబంధించి చెన్నై లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని తెలిసింది.

ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే కమెడియన్ యోగిబాబు. ఈయన రజనీకాంత్ సినిమాలన్నిటిలోనూ కనిపిస్తారు. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న కర్ణన్ చిత్రంలో ఈయన నటిస్తున్నారు.

K V D Varma

K V D Varma

Next Story