Tabu: ఆ హీరో వల్లే నేను పెళ్లి చేసుకోలేదు

* ఇప్పటికి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అతడే : టబు

Sandeep Reddy
Published on: 7 Nov 2021 4:52 PM IST
Tabu Reveals the Reason Behind the Still she did not get Marry
X

Tabu: ఆ హీరో వల్లే నేను పెళ్లి చేసుకోలేదు

Tabu: కూలీ నెం 1 చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకి పరిచయమైన టబు.. నవంబర్ 4వ తేదీన 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. తన కెరీర్లో తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో నటించిన టబు అసలు తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తన సోదరుడి స్నేహితుడేనని.. అజయ్ దేవగన్ తనకి 15 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పటి నుండే ముంబైలోని జుహు ప్రాంతంలో పెరిగామని చెప్పుకొచ్చింది.

ఆ వయస్సులో అజయ్ దేవగన్ తన వెంట పడేవాడని, ఎవరైనా అబ్బాయిలు నాతో మాట్లాడిన అతడికి కోపం వచ్చేదని, తనకి తెలియకుండానే వారిని కొట్టడానికి కూడా వెళ్ళేవాడని..నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నానోనని గమనిస్తూనే ఉండేవాడని టబు తెలిపింది. అజయ్ దేవగన్ వల్లే నేను ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోకుండా ఉన్నానని, నా పెళ్లి కాకుండా ఉన్నందుకు అజయ్ దేవగన్ పశ్చాతాపపడాలని టబు తన మనసులోని మాట బయటపెట్టింది. ఇక అజయ్ దేవగన్.. బాలీవుడ్ నటి కాజోల్ ని 1999లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవగన్ తో పాటు టబు గోల్ మాల్ అగైన్, హకికత్, దృశ్యం వంటి చిత్రాలలో నటించింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story