పాపం అనసూయ.. నితిన్ సినిమాలో చేయడానికి టబు ఒకే చెప్పినట్టేనా?
భీష్మ హిట్ అవడంతో మంచి జోష్ మీద ఉన్నాడు నితిన్. తన తరువాతి సినిమాను పట్టాలెక్కించేందుకు పరుగులు తీస్తున్నాడు. అప్పుడెప్పుడో అంధాదున్ హిందీ సినిమాను రీమేక్ చేయాలని రైట్స్ తీసుకుకున్నారు నితిన్ కోసం. అయితే, ఆ సినిమా చేయడానికి ధైర్యం చేయలేదు. కానీ, భీష్మ విజయం సాధించడంతో ఆ సినిమాని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సిద్ధం అయిపోయారు.
అంధాదున్ హిందీలో టబు కీలక పాత్ర పోషించారు. తెలుగులో కూడా టబు తో ఆ పాత్ర చేయించాలని తొలుత భావించారు. అయితే, ఆమె నో చెప్పేశారు. దీంతో జబర్దస్త్ అనసూయతో ఆ పాత్ర చేయించాలని ఫిక్స్ అయ్యారు. ఆ మేరకు అనసూయను ఒప్పించారనీ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అనసూయ స్థానంలో టబు వస్తున్నారని టాలీవుడ్ సమాచారం.
టబు ముందు సినిమా చేయడానికి అంగీకరించకపోయినా నితిన్ మాత్రం ఆ పాత్ర ఆమె చేయాలని పట్టు పెట్టారట. దీంతో ఆమెను ఒప్పించడం కోసం అన్ని ప్రయత్నాలు చేశారట. ఈ ప్రాసెస్ లో నితిన్ తన గురువు త్రివిక్రమ్ సహాయం కోరారట. త్రివిక్రమ్ కూడా తన శిష్యుడి కోసం టబు తో మాట్లాడి ఈ రీమేక్ చేయడానికి ఒప్పించినట్టు చెప్పుకుంటున్నారు. అల వైకుంఠపురములో సినిమాలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన టబు.. త్రివిక్రమ్ మాట తీసేయలేక ఈ సినిమా ఒప్పుకున్నారని వినిపిస్తోంది.
ఇక టబు కు సంబంధించిన పారితోషకం వగైరా అన్నీ ఒకే అయిన తరువాత అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే, అనసూయ కు ఒక మంచి పాత్ర చేజారిపోయినట్టే!




