Tapsi pannu shocked with electricity bill: మొన్న కార్తీక..ఈరోజు తాప్సీ కరంట్ బిల్లు

Tapsi pannu shocked with electricity bill: ఒక పక్కా కరోనాతోనే జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తుంటే మరో పక్కా కరెంట్ బిల్లులు జనాలకు మరింత షాక్ ని ఇస్తున్నాయి.

Krishna
Published on: 28 Jun 2020 7:57 PM IST
Tapsi pannu shocked with electricity bill: మొన్న కార్తీక..ఈరోజు తాప్సీ కరంట్ బిల్లు
X
Tapsi Pannu (file image)

Taapsi shocked with rise in electicity bill: ఒక పక్కా కరోనాతోనే జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తుంటే మరో పక్కా కరెంట్ బిల్లులు జనాలకు మరింత షాక్ ని ఇస్తున్నాయి. నిజానికి వాడుకున్న కరెంట్ కి, వచ్చే బిల్లుకి అస్సలు సంబంధం లేకుండాపోతుంది.. చిన్న చిన్న గుడిసెలకు కూడా లక్షల్లో బిల్లు వస్తున్నాయి. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా ఇదే పరిస్థితిని ఎదురుకుంటున్నారు.. ఇప్పటికే యంగ్ హీరోయిన్ కార్తీక ఈ సమస్యను ఎదురుకోగా, ఇప్పుడు మరో హీరోయిన్ కి ఇదే సమస్య ఏర్పడింది.. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఢిల్లీ భామ తాప్సీ ..

తాప్సీ ఉంటున్న నివాసానికి అదానీ ఎలక్ట్రిసిటీ సరఫరా ఉంది. అయితే కరోనా వలన గత మూడు నెలలుగా బిల్లు తీయ్యలేదు.. కానీ ఆ మూడు నెలల బిల్లును కలిపి ఒకేసారి పంపించారు ఎలక్ట్రిసిటీ అధికారులు.. ఆ మూడు నెలల బిల్లు ఏకంగా 36,000 రూపాయలగా ఉంది. తన ఇంటికి సాధారణ రోజుల్లో వచ్చే బిల్లు కంటే 10 రెట్లు బిల్లు ఎక్కువ రావడంతో తాప్సీ షాక్‌కు గురైంది. ఇదే విషయాన్నీ ట్వీటర్‌ వేదికగా స్పందిస్తూ తన ఆవేదన వ్యక్తం చేసింది.

వారానికి ఒక్కసారి వచ్చి ఉండే ఇంటికి ఇంత బిల్లు రావడం ఏంటి అని ప్రశ్నించింది. ఈ బిల్లు చూస్తుంటే మాకు తెలియకుండానే ఎవరో ఈ ఆపార్ట్‌మెంట్‌ను వినియోగిస్తున్నారనే భయం కలుగుతోంది అంటూ తన ఆవేదనని వ్యక్తం చేసింది తాప్సీ.. తన సమస్యను ట్విట్టర్ లో ఎలక్ట్రిసిటీ అధికారిక ఖాతాను ట్యాగ్ చేసింది తాప్సీ. ఇక తాప్సీ ట్వీట్‌పైన ఎలక్ట్రిసిటీ అధికారులు స్పందించారు.. మీటర్‌ రీడింగ్‌ ఆధారంగా తాము బిల్లు కొట్టామని క్లారిటీ ఇచ్చారు.

ఇక తాప్సీ సినిమాల విషయానికి వచ్చేసరికి మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మందినాదం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. ఇక మిస్టర్ ప‌ర్‌ఫెక్ట్‌, వీర, గుండెల్లో గోదారి, సాహ‌సం మొదలగు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమా ఆఫర్స్ లేకపోయినప్పటికీ మోడలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.



Krishna

Krishna

Next Story