Mission Impossible: మిషన్ ఇంపాజిబుల్ లో తాప్సి?

Mission Impossible: త్వరలో హైదరాబాద్ లో జరిగే మిషన్ ఇంపాజిబుల్ షూటింగ్ లో తాప్సి నటించనున్నట్లు సమాచారం.

Kranthi
Updated on: 15 Jun 2021 11:05 AM IST
Taapsee Mission Impossible Shooting in Hyderabad
X

Taapsee: (File Image) 

Mission Impossible: తాప్సి అనగానే ఇప్పుడు ఝుమ్మంది నాదంలోని బ్యూటీ గుర్తుకు రావడం లేదు.. గన్ పట్టుకుని ఫైట్స్ చేసే తాప్సి.. సమాజంలోని వివక్షను ఎదిరించే యాంగ్రీ ఉమెన్ కనపడుతోంది. పూర్తిగా మారిపోయిన తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ లోని మంచి నటీమణుల్లో ఒకటిగా నిలిచిపోయింది. గ్లామర్ కన్నా.. నటనలో గ్రామర్ చూపిస్తూ అదరగొడుతుంది. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఓ తెలుగు సినిమా చేయబోతుంది.

నటి తాప్సి తెలుగులో సినిమా చేసి చాలా కాలమైంది. 'గేమ్‌ ఓవర్‌' తర్వాత ఆమె నుంచి మరో తెలుగు చిత్రమేదీ రాలేదు. బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది. ప్రస్తుతం సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. త్వరలో ఆమె ఓ తెలుగు చిత్రంలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అదే.. స్వరూప్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మిషన్‌ ఇంపాజిబుల్‌'. 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' లాంటి విజయం తర్వాత స్వరూప్‌ నుంచి వస్తున్న రెండో చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పుడిందులో ఓ ప్రధాన పాత్ర కోసం తాప్పిని ఎంపిక చేసినట్లు సమాచారం.

ఈ చిత్రంలో ఆమె పాత్రకి ఎంతో ప్రాధాన్యముందని, కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంటుందని ప్రచారం వినిపిస్తోంది. లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల ఆగిన ఈ సినిమా.. త్వరలో తిరిగి సెట్స్‌పైకి వెళ్లనుంది. హైదరాబాద్‌లో జరగనున్న ఈ కొత్త షెడ్యూల్‌లోనే.. తాప్సి సెట్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ఈ సినిమాని నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. మార్క్‌.కె.రాబిన్‌ స్వరాలందిస్తున్నారు.

Kranthi

Kranthi

Next Story