చరిత్ర ఈరోజు మనతోనే మొదలవ్వాలి.. సైరా టీజర్ విడుదలైంది!

చరిత్ర ఈరోజు మనతోనే మొదలవ్వాలి.. సైరా టీజర్ విడుదలైంది!
x
Highlights

అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా స్టార్ చిరంజీవి సైరా సినిమా టీజర్ విడుదలైంది. దీంతో అభిమానులకు చిరంజీవి పుట్టినరోజు పండగ రెండు రోజుల ముందు వచ్చినట్టైంది.

వీరాధి వీరులారా చరిత్రలో మనం ఉండకపోవచ్చు.. కానీ, చరిత్ర ఈరోజు మనతోనే మొదలవ్వాలి... సైరా గర్జించాడు. ఎవరీ నరసింహారెడ్డి? సింహం దొరా.. మెగా అభిమానులకు పండగలాంటి చిరంజీవి పుట్టినరోజు వేడుకలు రెండురోజుల ముందే ప్రారంభం అయ్యాయి. సైరా మూవీ టీజర్ ముంబాయి లో రామ్ చరణ్ విడుదల చేశారు. దీంతో అభిమానుల సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో ప్రారంభం అయిన టీజర్.. నరసింహా రెడ్డిని యద్ధవీరుడిగా పరిచయం చేస్తూ ముందుకు సాగింది.

భారీ స్థాయిలో కనిపిస్తున్న యుద్ద దృశ్యాలు.. స్వతంత్ర ముందు కాలంలోకి తీసుకుపోతున్న సెట్టింగులు.. సైరా పై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. చిరంజీవి ఆహార్యం.. గ్రాఫిక్స్.. అన్నీ చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

సినిమా తీజర్ విడుదల అయిన వెంటనే యు ట్యూబ్ లో దూసుకుపోతోంది. మీరూ తీజర్ పై ఓ లుక్కేయండి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories