బాక్సాఫీస్ పై మెగా దండయాత్ర మొదలైపోయింది.. తొలిరోజు సైరా కలెక్షన్లు ఎంతో తెలుసా?

బాక్సాఫీస్ పై మెగా దండయాత్ర మొదలైపోయింది.. తొలిరోజు సైరా కలెక్షన్లు ఎంతో  తెలుసా?
x
Highlights

చిరంజీవి అంటే బాక్స్ బద్దలవ్వాల్సిందే! అందులోనూ ఓపెనింగ్స్ రికార్డులు బద్దలు కొట్టాలంటే మెగా స్టార్ తరువాతే ఎవరైనా. అత్యంత భారీ చిత్రంగా మెగా పవర్...

చిరంజీవి అంటే బాక్స్ బద్దలవ్వాల్సిందే! అందులోనూ ఓపెనింగ్స్ రికార్డులు బద్దలు కొట్టాలంటే మెగా స్టార్ తరువాతే ఎవరైనా. అత్యంత భారీ చిత్రంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా గాంధీ జయంతి సందర్భంగా రికార్డుల మీదకు సైరా అంటూ దూసుకువచ్చారు చిరంజీవి. వస్తూనే బాక్సాఫీస్ కొల్లగొడుతున్నారు. సినిమా విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్ రావడంతో సైరా కలెక్షన్లు ఒకరెంజిలోకి దూసుకు వెళ్ళిపోయాయి. అధికారికంగా లెక్కలు రానప్పటికీ విశ్లేషకుల అంచనాల ప్రకారం తొలిరోజే సైరా తొలిరోజే సుమారు రూ.85 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు వదిలిపెట్టి.. దక్షిణాదిలో తొలి రోజు 32 కోట్లు కొల్లగోట్టిన్దంతున్నారు. ఇక బాలీవుడ్ లోనూ అదేస్థాయిలో సొమ్ములు రాబట్టారట చిరంజీవి. 35 కోట్లు ఉత్తరాది లెక్కగా చెబుతున్నారు. ఇక ఓవర్సీస్ లోనూ ఎక్కడ తగ్గలేదు సైరా. 28 కోట్లు తొలిరోజే తన ఖాతాలో వేసుకుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటె.. తెలుగు రాష్ట్రాల్లో కూడా కలుపుకుని ఓవరాల్ గా 180 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లను సైరా రాబట్టిందని తెలుస్తోంది. ఈ గాలి చూస్తుంటే రెండు మూడు రోజుల్లోనే కలెక్షన్ల రికార్డులన్నీ బద్దలయ్యే అవకాశం దానితో బాటు లాభాల బాటలోకి సినిమా వెళ్ళడం జరిగిపోయే అవకాశాలున్నాయని సినిమా విశ్లేషకులు అంటున్నారు.

మొత్తమ్మీద సైరా తో ఈ దసరాకి కలెక్షన్ల యుద్ధం మొదలెట్టేశారు చిరంజీవి. ఇక ఏ రేంజిలో రికార్డులు బద్దలవుతయనేది వేచి చూడాల్సిందే!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories