ఎన్నాళ్లకెన్నాళ్లకు: సైరా తో శాతకర్ణి

ఎన్నాళ్లకెన్నాళ్లకు: సైరా తో శాతకర్ణి
x
Highlights

ఒకరు యువరత్న.. మరొకరు మెగా స్టార్.. ఇద్దరూ ఒక దగ్గర కలిస్తే అభిమానులకు పండగే. చిరంజీవి, బాలకృష్ణ ఒక దగ్గర కలిసి ముచ్చట్లు చెప్పుకుంటున్న ఫోటో ఇప్పుడు వైరల్ అయింది.

మెగాస్టార్ చిరంజీవి.. యువరత్న బాలకృష్ణ ఇద్దరూ తెలుగు చిత్ర సీమలో టాప్ హీరోలే కాదు.. తెలుగు ప్రజల మనసులు గెల్చుకున్న స్టార్ లు కూడా. ఈ ఇద్దరూ ఎప్పుడు కలిసినా అది కన్నులపండువ గానే ఉంటుంది. ఇటు అభిమానులు.. అటు ప్రేక్షకులు కూడా ఈ ఇద్దరి కలిశారంటే చాలా ఆసక్తిగా గమనిస్తారు. వీరు ఒకరితో ఒకరు కలిసి ఉన్న ఫోటోలు చాలా తక్కువగా కనిపిస్తాయి. కారణాయాలేమైనా కానీయండి వీరిద్దరి కలయికలో సినిమా మాత్రం రాలేదు. కానీ, ఇద్దరి మధ్య మంచి బంధమే ఉందని నిరూపిస్తాయి అప్పుడప్పుడు వీరిద్దరి కలయికతో ఉన్న ఫోటోలు బయటకు వచ్చి అందర్నీ అలరిస్తాయి.

చాలా కాలం తరువాత చిరంజీవి, బాలకృష్ణ ఒక దగ్గర కలిసారు. ప్రముఖ సినీదర్శకుడు దివంగత కోడిరామకృష్ణ రెండో కుమార్తె ప్రవల్లిక నిశ్చితార్థం నిన్న రాత్రి పార్క్ హయత్ లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ, చిరంజీవి కలుసుకున్నారు. ఇద్దరూ పక్క పక్కనే కూచుని చాలా సేపు ముచ్చట్లాడుకున్నారు. ఇటీవలే సైరా సినిమా సాధించిన విజయంతో తెలుగు తెరపై తన స్టామినా నిరూపించిన మెగా స్టార్ చిరంజీవి బాలకృష్ణ తో కలసి ఉన్న ఫోటో ప్రస్తుతం నేట్టింట్లో వైరల్ గా మారాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories