బీదర్ లో 'సైరా' కు బ్రేకులు వేసిన ప్రజలు

బీదర్ లో సైరా కు బ్రేకులు వేసిన ప్రజలు
x
Highlights

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న 'సైరా...

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' ఒకటి. చిత్ర బృందం ఈ సినిమా గురించి ప్రతి ఒక్క చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తలను వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక్క సీన్ ను బీదర్లో చిత్రీకరించాలని ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. గత వారం పది రోజుల నుంచి అక్కడే చిత్రీకరణ జరుగుతూ వస్తోంది. దాని కోసం చిత్రబృందం కొన్ని అధికారుల నుండి అనుమతి కూడా పొందింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మధ్య ఒక రోజు షూటింగ్ మొదలైన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని షూటింగ్ ను అడ్డుకున్నారట.

అక్కడ ఒక యాక్షన్ సీన్ చిత్రీకరించాల్సి ఉంది. కానీ ఈ నటీనటులు కాస్ట్యూమ్స్ మరియు కత్తులను చూసి ఇలాంటి సీన్ల చిత్రీకరణకు తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటూ స్థానికులు చెప్పడం జరిగింది. ఇక చేసేదేమీ లేక పోలీసులు సీన్ లోకి ఎంటర్ అయి చిత్రబృందానికి నచ్చ చెప్పి అక్కడి నుండి షూటింగ్ క్యాన్సిల్ చేసి తిరిగి వచ్చేలా చేసిందట. అంతా కష్టపడి బీదర్ వెళ్లినప్పటికీ 'సైరా' సినిమా షూటింగ్ అక్కడ జరగలేదు. ఇక ఈ సీన్లను కోకాపేటలో ఒక భారీసెట్ వేసి అందులో చిత్రీకరించాలని సన్నాహాలు జరుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories