సీమ లో సందడిచేయనున్న 'సై రా' బృందం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా పై భారీ అంచనాలున్నాయి.

Ruthvik
Published on: 3 Jan 2019 1:31 PM IST
Sye Raa Narasimha Reddy
X
Sye Raa Narasimha Reddy

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా పై భారీ అంచనాలున్నాయి. షూటింగ్ మధ్య లో కొన్ని గాప్స్ వస్తున్నప్పటికీ, షూటింగ్ స్పీడ్ తగ్గకుండా చిత్రబృందం జాగ్రత్త వహిస్తోంది. ఇప్పటికే జార్జియాలో కొన్ని కీలకమైన యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయింది. తరువాత హైదరాబాద్ శివార్లలో షూటింగ్ బ్రేకుల్లేకుండా కొనసాగింది. తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకున్న 'సై రా' బృందం కొత్త షెడ్యూల్ కి సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో రామోజీ ఫిలిం సిటీలో రాయలసీమ ను ప్రతిబింబించేలా ఒక పల్లెటూరి సెట్ ని ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ డిజైన్ చేసారని తెలుస్తోంది. ఈ సెట్ లో కొన్నాళ్లు షూటింగ్ సాగనుంది అని సమాచారం. అమితాబ్ బచ్చన్ సీన్లు కూడా ఈ షెడ్యూల్ లొనే పూర్తి చేస్తారట. సంక్రాంతి తరువాత ఈ సినిమా షూటింగ్ మళ్ళీ తెరకెక్కనుంది. నరసింహరెడ్డి గూడెంలో జరిగే కొన్ని కీలకమైన సంఘటనలు ఈ షెడ్యూల్ లో పూర్తిచేయాల్సి ఉంది. నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, జగపతి బాబు తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనపడనున్నారు.

Ruthvik

Ruthvik

Next Story