సైరా ప్రభంజనం.. అక్కడ బాహుబలి 2 రికార్డ్ బ్రేక్!

సైరా ప్రభంజనం.. అక్కడ బాహుబలి 2 రికార్డ్ బ్రేక్!
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి కలల సినిమా సైరా! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రికి కానుకగా నిర్మించిన సినిమా సైరా! ఈ సినిమా విడుదల నాటి నుంచి పాజిటివ్ టాక్.....

మెగాస్టార్ చిరంజీవి కలల సినిమా సైరా! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రికి కానుకగా నిర్మించిన సినిమా సైరా! ఈ సినిమా విడుదల నాటి నుంచి పాజిటివ్ టాక్.. విమర్శకుల ప్రసంశలతో హిట్ టాక్ తో నిలిచింది. కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సాధిస్తోంది. నెల్లూరు సిటీ‌లో మొదటి వారానికే కోటిరూపాయలు రాబట్టి టాప్ ప్లేస్ దక్కించుకుంది సైరా. అక్కడ వారంలో కోటి రూపాయలు షేర్ రాబట్టిన ఏకైక సినిమాగా మెగాస్టార్ సైరా నిలిచింది.ఇక వెండి తెరపై దసరా పండగ కలేక్షన్లన్నీ ఏకపక్షంగా కుమ్మేసింది సైరా మూవీ. సినిమా విడుదలైన ఎడోరోజు మంగళవారం 12 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది ఈ సినిమా. ఇది బాహుబలికి తప్ప మరో సినిమాకి సాధ్యం కాని ఫీట్ అని చెబుతున్నారు. ఈ పన్నెండు కోట్లు కూడా తెలుగు వెర్షన్ నుంచి ఎక్కువ శాతం వచ్చయంటున్నారు పరిశీలకులు. దీంతో వారం మొత్తంలో 12.30 లక్షల షేర్ రాబట్టి బాహుబలి 2 తరువాతి స్థానంలో నిలిచింది సైరా!

ఇక తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే.. ఉత్తరాంధ్రలో కోటిన్నరకు పైగా రాబట్టి రికార్డు సృష్టించింది అంటున్నారు. నెల్లూరు జిల్లాలో మాత్రం సైరా ప్రభంజనాన్ని వర్ణించలేని విధంగా ఉంది. ఇక్కడ ఒక్క వారంలో 3 కోట్ల 90 లక్షల షేరు రాబట్టింది. ఇక్కడ బాహుబలి 2 కలెక్షన్ 4కోట్ల 50 లక్షలు.. అంటే ఆ సినిమాకి చాలా దగ్గర వరకూ సైరా వెళ్ళింది. ఇక సీడెడ్ లో మంగళవారం ఒక్క రోజు 1.70 కోట్లు కొల్లగొట్టింది. దీంతో మొత్తం ఏడూ రోజుల్లో 15 కోట్లు కొల్లగోట్టినట్టయింది.

అటు హిందీ లోనూ మెల్లగా సైరా పుంజుకుంటోంది. సైరా కు అక్కడ వార్ అడ్డంగా నిలవడంతో ఓపెనింగ్స్ అనుకున్నంత లేవు. కానీ, మంగళవారానికి పరిస్థితి మారింది. వార్ సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో మంగళవారం ఒక్కరోజే కోటి రూపాయలకు పైగా దక్కించుకుంది మెగాస్టార్ మూవీ సైరా. దీంతో ఏడు రోజులకు అక్కడి కలెక్షన్స్ 9.25 కోట్లకు చేరుకున్నాయి. ఇదే కొనసాగితే.. 20 కోట్లవరకూ హిందీలో సాధించే అవకాశం కనిపిస్తోంది.

ఇక ఓవర్సీస్ లో మంగళవారం లక్ష డాలర్లు మాత్రమె రాబట్టగలిగింది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే.. అన్ని ఏరియాలు.. అన్ని భాషల కలెక్షన్స్ గ్రాస్ 196 కోట్లకు చేరింది. డబుల్ సెంచరీకి దగ్గరగా వచ్చి ఆగిపోయింది. 100 కోట్లు షేర్ వచ్చిందని చెబుతున్నారు. ఇక ఫుల్ రన్ లో సైరా మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని ఖాయంగా చెప్పవచ్చు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories