Sushant Singh Rajput's Sister Emotional Tweet : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ సోదరి ఎమోషనల్ ట్వీట్!

Sushant Singh Rajput’s Sister Emotional Tweet : రాఖి పౌర్ణమి సందర్భంగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ సోదరి శ్వేతాసింగ్

Krishna
Published on: 3 Aug 2020 4:08 PM IST
Sushant Singh Rajputs Sister Emotional Tweet :  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ సోదరి ఎమోషనల్ ట్వీట్!
X
Sushant Singh Rajput (File Photo)

Sushant Singh Rajput's Sister Emotional Tweet : రాఖి పౌర్ణమి సందర్భంగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ సోదరి శ్వేతాసింగ్ కీర్తి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సుశాంత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు ఆమె.. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా..నువ్వు ఎప్పుడు మాకు గర్వకారణమే. రాఖి శుభాకాంక్షలు అంటూ ఆమె పాత ఫోటోలను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. 'హ్యాపీ రక్షాబంధన్ మేరా స్వీట్ సా బేబీ...బహుత్ ప్యార్ కర్తే హై హమ్ ఆప్కో జాన్...ఔర్ హమేషా కర్తే రహెంగే...యూ వర్..ఆర్..యూ విల్..అవర్ ప్రైడ్' అంటూ ఆమె ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు.

ఇక సుశాంత్ మరో సోదరి నీతూ సింగ్ కూడా సుశాంత్ పైన ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. సుశాంత్ చిన్నప్పటి ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలను కుర్చీలో కూర్చున్న సుశాంత్‌తో అతని తల్లి అక్కచెల్లెలందరికీ రాఖీ పండగ రోజున డబ్బులు ఇస్తున్న ఫోటోను సుశాంత్ సోదరి శ్వేతా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నాయి.



అటు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూలై నెలలో 14 వ తేదిన తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు.. అయితే అనే అతను ఆత్మహత్యను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఫ్యూచర్ స్టార్ గా మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలవరపరిచింది. ఇక సుశాంత్ చివరగా నటించిన 'దిల్ బేచారా' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

Krishna

Krishna

Next Story