Sushant Singh Rajput Shine Brightest: సుశాంత్ పేరు మీద న‌క్ష‌త్రం

Sushant Singh Rajput Shine Brightest: బాలీవుడ్ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే..

Krishna
Published on: 7 July 2020 2:41 PM IST
Sushant Singh Rajput Shine Brightest: సుశాంత్ పేరు మీద న‌క్ష‌త్రం
X

Sushant Singh Rajput Shine Brightest: బాలీవుడ్ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ముంబై పోలీసులు నిర్ధారించారు.. అయితే అతని ఆత్మహత్యను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఫ్యూచర్ స్టార్ గా మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలవరపరిచింది. ఈ క్రమంలో సుశాంత్ అభిమాని ఒకరు సుశాంత్ కి ఘన నివాళి అర్పించారు.. అమెరికాలో ఉండే ర‌క్ష అనే అభిమాని ఖ‌గోళ శాస్త్ర సంస్థ నుండి ఓ న‌క్ష‌త్రాన్ని కొనుగోలు చేసి దానికి సుశాంత్ అనే పేరు పెట్టారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేష‌న్ కాపీని కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు..

ఈ సందర్భంగా రక్ష మాట్లాడుతూ.. " సుశాంత్ ఓ అద్భుతమైన వ్యక్తి.. అతనికి నివాళులు అర్పించడం చాలా ఆలస్యం అయింది.. సుశాంత్ పేరు మీద ఓ న‌క్ష‌త్రాన్ని కొన‌డం సంతోషంగా ఉంది. దీనికి సంబంధించిన కాపీ రైట్స్ లభించాయి. ఆ తార మ‌రింత‌గా మెర‌వాలి "అని కోరుకుంటున్నట్లుగా రక్ష వెల్లడించారు.. ఇక సుశాంత్‌కు ఖ‌గోళ ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే..

ఇక సుశాంత్ చివరగా నటించిన 'దిల్ బేచారా' (Dil Bechara) సినిమాని త్వరలో అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు..వచ్చే నెల 24న ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) లో విడుదల చేయనున్నారు.. ఈ సినిమాను ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. హాలీవుడ్ లో వచ్చిన 'ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్'కు ఈ సినిమా రీమేక్ గా తీశారు. సంజనా సాంఘీ ఈ సినిమాలో సుశాంత్ హీరోయిన్ గా నటించింది. ముఖేశ్ చాబ్రా తొలిసారిగా దర్శకత్వం వహించారు.. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది..

Krishna

Krishna

Next Story