Sushant Singh Rajput Biopic First Look Released: సుశాంత్ జీవితంపై సినిమా.. ఫస్ట్ లుక్ రిలీజ్!

Sushant Singh Rajput Biopic First Look Released: బాలీవుడ్ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే..

Krishna
Updated on: 20 July 2020 3:26 PM IST
Sushant Singh Rajput Biopic First Look Released: సుశాంత్ జీవితంపై సినిమా.. ఫస్ట్ లుక్ రిలీజ్!
X
Suicide or Murder Movie First Look

Sushant Singh Rajput Biopic First Look Released: బాలీవుడ్ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ముంబై పోలీసులు నిర్ధారించారు.. అయితే అతని ఆత్మహత్యను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఫ్యూచర్ స్టార్ గా మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలవరపరిచింది.

అయితే ఇప్పుడు సుశాంత్ జీవితం పైన ఓ సినిమా తెరకెక్కుతుంది. నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సూసైడ్ ఆర్ మర్డర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో నెలకొన్న పక్షపాతధోరణి, అపోహలను తొలగించేందుకు ఈ చిత్రం నిర్మిస్తున్నానని వెల్లడించారు.

ఇక సెప్టెంబర్15 న సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని, ముంబై, పంజాబ్ లలో సినిమాని చిత్రీకరిస్తామని వెల్లడించారు. సుశాంత్ మృతి కేసులో విచారణ ఎదుర్కొంటున్నవారి పాత్రలు కూడా ఇందులో వుంటాయని వెల్లడించారు. ఇక సుశాంత్ ది ఆత్మహత్య కాదని, హత్య అని దీనిపైన సీబీఐ విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు. ఈ క్రమంలో సుశాంత్ పైన ఓ సినిమా వస్తుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

ఇక అటు సుశాంత్ చివరగా నటించిన 'దిల్ బేచారా' (Dil Bechara) సినిమాని త్వరలో అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు..వచ్చే నెల 24న ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో విడుదల చేయనున్నారు.. ఈ సినిమాను ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. హాలీవుడ్ లో వచ్చిన 'ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్'కు ఈ సినిమా రీమేక్ గా తీశారు. సంజనా సాంఘీ ఈ సినిమాలో సుశాంత్ హీరోయిన్ గా నటించింది. ముఖేశ్ చాబ్రా తొలిసారిగా దర్శకత్వం వహించారు.. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది..


Krishna

Krishna

Next Story