Sushant Singh Rajput's Death Case Updates: సుశాంత్ కేసులో మ‌రో ట్వీస్ట్! ఆయ‌న‌ది ఖ‌చ్చితంగా హ‌త్యే: అంకిత్ ఆచార్య

Sushant Singh Rajput's Death Case Updates: బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మిక మృతి కేసులో రోజుకో కొత్త కథనం వెలుగుకి వస్తోంది. ఇప్ప‌టికే ఈ కేసులో సుప్రీంకోర్టు సీబీఐ ద‌ర్యాప్తున‌కు అంగీక‌రించింది.

Karampoori Rajesh
Updated on: 7 Aug 2020 11:44 PM IST
Sushant Singh Rajputs Death Case Updates: సుశాంత్ కేసులో మ‌రో ట్వీస్ట్! ఆయ‌న‌ది ఖ‌చ్చితంగా హ‌త్యే: అంకిత్ ఆచార్య
X
SUSHANTH SINGH case updates

Sushant Singh Rajput's Death Case Updates: బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మిక మృతి కేసులో రోజుకో కొత్త కథనం వెలుగుకి వస్తోంది. ఇప్ప‌టికే ఈ కేసులో సుప్రీంకోర్టు సీబీఐ ద‌ర్యాప్తున‌కు అంగీక‌రించింది. మ‌రోవైపు ఈడీ అధికారుల ఎదుట రియా హాజ‌రైంది. ఇదిలా ఉంటే తాజాగా మ‌రో సంచ‌ల‌నాత్మ‌క వ్యాఖ్య‌లు తెర మీద‌కు వ‌చ్చాయి. సుశాంత్‌ను అతని పెంపుడు కుక్క బెల్టుతో ఉరివేసి చంపారని చేసి చంపారంటూ సుశాంత్ స‌న్నిహితుడు, మాజీ అసిస్టెంట్ అంకిత్ ఆచార్య ఆరోపించారు.

సుశాంత్ గురించి నాకు బాగా తెలుసు. ఇది ఆత్మ‌హ‌త్య అంటే నేను న‌మ్మ‌ను. ఖ‌చ్చితంగా హత్యే. ఒక‌వేళ సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని అనుకున్నా..మెడ‌పై యూ ఆకారంలో మార్క్ ఉండాలి. కానీ ఎవ‌రైనా కొట్టిన‌పుడు.. గొంతు నులిమి చంపితేనే మృతుడి మెడ చుట్టూ వృత్తాకారంలో గుర్తులుంటాయన్నారు. సుశాంత్ మెడపై అలాంటి గుర్తులే ఉన్నాయి అని అంకిత్ పేర్కొన్నాడు.

ఒక‌వేళ ఆత్మ‌హ‌త్య అయితే క‌ళ్లు తేలేసిన‌ట్టు, నాలుక బ‌య‌ట‌కొస్తుంది. నోటి నుంచి నుర‌గ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. కానీ ఇలాంటి ఏమి లేవ‌ని ఆయ‌న అన్నారు. కాబ‌ట్టి సుశాంత్ ది ఖచ్చితంగా హ‌త్యేన‌ని అంకిత్ ఆచార్య ఆరోపిస్తున్నాడు. ఈ కేసులో పార‌ద‌ర్శ‌కంగా విచార‌ణ జ‌రిపి, నిందితుల‌కు ఉరిశిక్ష వేయాల‌ని డిమాండ్ చేశాడు. దీంతో అంకిత్ వ్యాఖ్య‌లు ప‌లు అనుమానాల‌కు తావిస్తున్నాయి.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story