Sushant Death Case Updates: సుశాంత్ మరణంపై షాకింగ్ వీడియో

Sushant Death Case Updates: బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను షాక్‌కు గురిచేసింది. అనేక పరిణామాల అనంత‌రం ఈ కేసును ప్రస్తుతం ముంబై పోలీసులు విచారిస్తున్నారు.

Karampoori Rajesh
Published on: 3 Aug 2020 1:28 PM IST
Sushant Death Case Updates: సుశాంత్ మరణంపై షాకింగ్ వీడియో
X
sushanth

Sushant Death Case Updates: బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను షాక్‌కు గురిచేసింది. అనేక పరిణామాల అనంత‌రం ఈ కేసును ప్రస్తుతం ముంబై పోలీసులు విచారిస్తున్నారు. అయితే, బీహార్ పోలీసులు కూడా కేసు విచారణలో పాలు పంచుకున్నారు. ఈ కేసులో రోజుకో కొత్త విష‌యం వెలుగులోకి వ‌స్తుంది.

తాజాగా సుశాంత్ మరణంపై ఓ షాకింగ్ వీడియో సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం రేపుతుంది. ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా.మీనాక్షి మిశ్రా సుశాంత్ ది ఆత్మహత్య కాదు.. హత్య అంటూ.. సుశాంత్ మ‌ర‌ణించిన‌ త‌ర్వాత తీసిన ఫోటోల‌ని ఒక్కొక్క‌టిగా చూపిస్తూ వాటిపై త‌న వాద‌న‌ని వినిపించింది. సుశాంత్ ముఖంపై, ఇత‌ర భాగాల్లో గాయాలు క‌నిపిస్తున్నాయి. అలాగే ఉరి వేసుకున్నపుడు బాధితుడి శరీరంపై మార్పులను గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. అనేక ప‌లు అనుమానాలను వ్య‌క్తం చేశారు.

కొద్ది రోజుల కిత్రం సుశాంత్‌ది ఆత్మ‌హ‌త్య కాదు..క‌చ్చితంగా హ‌త్యే అంటూ సంచ‌ల‌న రేపిన‌ మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ స్వామి చేసిన పోస్ట్‌ను రీ ట్వీట్ చేయ‌డం విశేషం. దీంతో ఈ కేసులో ప‌లు అనుమానాలు రేకెత్తిస్తుంది.


Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story