Aakasam Nee Haddura Remake: హిందీలో సూర్య "ఆకాశం నీ హద్దురా" రీమేక్

Sandeep Reddy
Updated on: 12 July 2021 2:44 PM IST
Surya Aakasam Nee Haddura Movie Remake in Bollywood Directed By Sudha Kongara
X

ఆకాశం నీ హద్దురా పోస్టర్(ట్విట్టర్ ఫోటో)

Aakasam Nee Haddura Remake: తమిళ చిత్రం "సూరరై పొట్ట్రు" తెలుగులో "ఆకాశం నీ హద్దురా" సూర్య నటించిన చిత్రం తాజాగా హిందీలో కూడా రీమేక్ అవబోతుంది. తెలుగు, తమిళంలో సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని హిందీలో కూడా సుధా కొంగర దర్శకత్వం వహించనుంది. ఎయిర్ డెక్కన్ అధినేత కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై బాలీవుడ్ కన్నుపడింది. 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో హీరో సూర్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత గునీత్ మోంగ హిందీలో నిర్మించనున్నాడు. అయితే ఈ చిత్రంలో సూర్య పాత్రకి అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం మరియు హ్రితిక్ రోషన్ వంటి హీరోలలో ఒకరిని ఎంచుకోనున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రం ఐఎండిబి లో 9.1 రేటింగ్ తో ఓటీటీ స్ట్రిమింగ్ లో కూడా దూసుకుపోతుంది. ఇక హిందీ రీమేక్ విషయాన్నీ ఆ చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇక గౌతం వాసుదేవ్ మీనన్, కే వి ఆనంద్, బిజోయ్ నంబియార్ వంటి దర్శకులు తెరకెక్కిస్తున్న "నవరస" వెబ్ సిరిస్ లో ఒక లవర్ బాయ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే అటు వెబ్ సిరీస్ మరియు సినిమాలతో బిజీగా ఉన్న సుధా కొంగర బాలీవుడ్ లో గతంలో "సాలా ఖడూస్" చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఘన విజయం సాధించి తాజాగా "ఆకాశం నీ హద్దురా" చిత్ర రీమేక్ తో మరోసారి తన దర్శకత్వ ప్రతిభని చూపించనుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story