కొడుకును లాంచ్ చేయనున్న స్టార్ హీరో

Suriya
x
Suriya
Highlights

టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరోల లో సూర్య ఒక్కడు. తను నటించిన ప్రతి సినిమాను తెలుగులో కూడా విడుదల చేయడమే కాకుండా బోలెడు హిట్ చిత్రాలను కూడా నమోదు చేసుకున్నాడు.

టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరోల లో సూర్య ఒక్కడు. తను నటించిన ప్రతి సినిమాను తెలుగులో కూడా విడుదల చేయడమే కాకుండా బోలెడు హిట్ చిత్రాలను కూడా నమోదు చేసుకున్నాడు. సూర్య కు ఒక కూతురు ఒక కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. సూర్య ఎనిమిదేళ్ల తనయుడైన దేవ్ ఇప్పుడు సినిమాల్లో కి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటిదాకా అధికారిక ప్రకటన లేనప్పటికీ ఈ మధ్యనే సూర్య కుటుంబం నుంచి కూడా క్లారిటీ వచ్చేసింది.

సూర్య హోమ్ బ్యానర్ అయిన 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్న ఒక పిల్లల సినిమాలో దేవ్ కనిపించనున్నాడు. చిన్నపిల్లల సినిమాలు చేయడం సూర్యకు చాలా ఇష్టం. ఇప్పటికే 'మేము' అనే సినిమాలో సూర్య హీరోగా నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా తమిళంలో మాత్రం బాగానే ఆడింది. ఇప్పుడు తన కొడుకును ముఖ్య పాత్రలో పెట్టి సూర్య మరొక సినిమాను నిర్మించనున్నాడు. ఇక సూర్య ఫ్యాన్స్ అందరూ దేవ్ ని తెరపై చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories