పదహారేళ్ల తరువాత రీమేక్ కానున్న గౌతం మీనన్ సినిమా

పదహారేళ్ల తరువాత రీమేక్ కానున్న గౌతం మీనన్ సినిమా
x
Highlights

పోలీస్ కథ ఫార్ములానే సరికొత్తగా మార్చి టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ మీనన్ తమిళంలో 'కాక కాక' అనే సినిమా తీశారు. అదే సినిమాను తెలుగులో వెంకటేష్ మరియు ఆసిన్...

పోలీస్ కథ ఫార్ములానే సరికొత్తగా మార్చి టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ మీనన్ తమిళంలో 'కాక కాక' అనే సినిమా తీశారు. అదే సినిమాను తెలుగులో వెంకటేష్ మరియు ఆసిన్ హీరోహీరోయిన్లుగా పెట్టి 'ఘర్షణ' అనే టైటిల్ తో రీమేక్ చేశారు. రెండు సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కలైపులి తాను నే ఈ రెండు సినిమాలకు నిర్మాత. అయితే ప్రస్తుతం సినిమా దర్శక నిర్మాతలు ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ప్రయత్నాల్లో ఉన్నారని కోలీవుడ్ కోడైకూస్తోంది. ఇన్నాళ్ల తర్వాత ఆ 'కాక కాక' లో ని పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తుంటాడు అనే పాయింట్ పై గౌతమ్ మీనన్ ఒక కథ రాసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తమిళంలో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన జ్యోతిక చనిపోతుంది కానీ తెలుగులో మాత్రం వెంకటేష్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఆసిన్ ని బ్రతికించారు. కాబట్టి ఈ సినిమా సీక్వల్ లో వేరే హీరోయిన్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సూర్య 'ఎన్జీకే' మరియు 'కాప్పన్' సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. మరోవైపు గౌతమ్ కూడా విశాల్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూర్య హీరోగా 'కాక కాక' సినిమా సీక్వెల్ మొదలవుతుందని తెలుస్తోంది. మరి అదే సినిమాను తెలుగులో వెంకటేష్ 'ఘర్షణ 2' ని తీస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories