First look of Suriya Vaadi Vasal Movie: ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచేసిన సూర్య!

First look of Suriya Vaadi Vasal Movie: తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సూర్య.. గజినీ, ఆరు, సూర్య సన్నాఫ్ కృష్ణన్

Krishna
Published on: 23 July 2020 2:40 PM IST
First look of  Suriya Vaadi Vasal Movie: ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచేసిన సూర్య!
X
First look of Suriya and Vetri Maaran's 'Vaadi Vasal'

First look of Suriya Vaadi Vasal movie: తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సూర్య.. గజినీ, ఆరు, సూర్య సన్నాఫ్ కృష్ణన్ , సింహం సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య.. ఇక సౌత్ ఇండియలో ప్రస్తుతం వున్న యంగ్ హీరోలలో అధికంగా రెమ్యునిరెషన్ తీసుకుంటున్న యంగ్ హీరో కోలీవుడ్ స్టార్ సూర్యనేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ రోజు సూర్య పుట్టిన రోజు సందర్భంగా తాజాగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'వాడి వ‌స‌ల్' నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం..

గ్రామీణ ప్రాంతం బ్యాక్ డ్రాప్ వాట‌ర్ క‌ల‌ర్ థీమ్ తో ఉన్న పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇక ఈ పోస్టర్ లో కూడా సూర్య అదిరిపోయాడనే చెప్పాలి. త‌మిళ‌నాడు సంప్రదాయ జ‌ల్లిక‌ట్టు క్రీడ నేప‌థ్యంలో, రివేంజ్ డ్రామాగా ఈ సినిమా తెర‌కెక్కుతోందని తెలుస్తోంది. ఇందులో సూర్య రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.



ఈ సినిమాని క‌లైపులి ఎస్ థాను నిర్మిస్తుండగా, . జీవీ ప్రకాశ్ కుమార్సంగీతం అందిస్తున్నారు. ఇక ధనుష్ హీరోగా తెరకెక్కిన అసురన్ సినిమాని తెరకెక్కించిన వెట్రిమార‌న్ ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా వస్తుండడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో ఈ సినిమా పట్టాలేక్కనుంది. ఇక ఈ సినిమాతో పాటుగా మరో రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు సూర్య..

ఇక సూర్య ఈ రోజు తన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా నేపధ్యంలోనే తన అభిమానులను, శ్రేయభిలషులు ఇంటికి రావొద్దని, మీ ఆశీస్సులు ఎప్పుడు తనకి ఉంటాయని సూర్య వెల్లడించారు, ఇక సూర్య సినీ నటీ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే..

Krishna

Krishna

Next Story