సూర్య సినిమాకి సూపర్ టైటిల్

Suriya
x
Suriya
Highlights

టాలీవుడ్ లో స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగే ఉంది. ఈ మధ్యనే 'గ్యాంగ్' అనే సినిమా ట్రైలర్ తో మన ముందుకు వచ్చిన సూర్య తరువాత 'ఎన్ జి కే' సినిమా తో మన ముందుకు రానున్నాడు.

టాలీవుడ్ లో స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగే ఉంది. ఈ మధ్యనే 'గ్యాంగ్' అనే సినిమా ట్రైలర్ తో మన ముందుకు వచ్చిన సూర్య తరువాత 'ఎన్ జి కే' సినిమా తో మన ముందుకు రానున్నాడు. ఈ సినిమా తర్వాత సూర్య తన 37వ సినిమాను దర్శకుడు కె.వి.ఆనంద్ తో చేయనున్నాడు. ఇది సూర్య కె.వి.ఆనంద్ కాంబోలో రానున్న మూడవ సినిమా. ఇప్పటికే 'వీడొక్కడే', మరియు 'బ్రదర్స్' సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ కాంబో మరొక సినిమా తో మన ముందుకు రానున్నారు న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమాకు టైటిల్ 'Kaappaan' అని అధికారికంగా ప్రకటించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సినిమా లో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధానమంత్రి పాత్రలో కనిపించనున్నారని, సూర్య బాడీగార్డ్ లా నటించనున్నాడని సమాచారం. ఆర్య, సముద్రఖని, సయేషా తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై అల్లిరాజ శుభస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories