కోలీవుడ్ హిట్ సినిమా రైట్స్ కొనుగోలు చేసిన సురేష్ ప్రొడక్షన్స్

కోలీవుడ్ హిట్ సినిమా రైట్స్ కొనుగోలు చేసిన సురేష్ ప్రొడక్షన్స్

admin1
Updated on: 10 Jan 2022 8:30 PM IST
Suresh Productions Buy the Rights to The Kollywood Hit Movie
X

కోలీవుడ్ హిట్ సినిమా రైట్స్ కొనుగోలు చేసిన సురేష్ ప్రొడక్షన్స్

Suresh Productions: కోలీవుడ్ ప్రముఖ హీరో సింబు మరియు ఎస్ జె సూర్య కలిసి నటించిన సినిమా "మానాడు". సై ఫై యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది. వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్ 25 న విడుదలైంది. అయితే విడుదలైన మొదటి రోజు నుండే ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే తాజాగా కొన్ని టాలీవుడ్ నిర్మాణ సంస్థల కన్ను ఈ సినిమా పై పడింది.

తాజా సమాచారం ప్రకారం ప్రముఖ టాలీవుడ్ ప్రొడక్షన్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమా రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాక అన్ని భారతీయ భాషల్లో రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకుంది సురేష్ ప్రొడక్షన్స్. అలాగే తెలుగులో థియేట్రికల్ డబ్బింగ్ రైట్స్ ని కూడా సురేష్ ప్రొడక్షన్స్ వారే కొనుగోలు చేశారు. మరి ఈ సినిమాని తెలుగులో డబ్ చేస్తారా లేక రీమేక్ చేస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

admin1

admin1

Next Story