Darbar: దర్బార్ ట్విట్టర్ రివ్యూ : తలైవా ఆదరగొట్టాడట!

Darbar: దర్బార్ ట్విట్టర్ రివ్యూ : తలైవా ఆదరగొట్టాడట!
x
Highlights

రజనీకాంత్ మళ్ళీ బాక్సాఫీస్ మీద దండయాత్ర మొదలు పెట్టారు. దర్బార్ సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు రజనీకాంత్. ఇప్పటికే సినిమా ప్రపంచవ్యాప్తంగా...

రజనీకాంత్ మళ్ళీ బాక్సాఫీస్ మీద దండయాత్ర మొదలు పెట్టారు. దర్బార్ సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు రజనీకాంత్. ఇప్పటికే సినిమా ప్రపంచవ్యాప్తంగా తోలి ఆటలు మొదలైపోయాయి. కొన్ని చోట్ల ప్రీమియం షో లు పూర్తయిపోయాయి. దీంతో అభిమానులు తమ అభిమాన హీరో రజనీకాంత్ దర్బార్ సినిమా ఎలా ఉండనే అభిప్రాయాల్ని ట్విట్టర్ లో పంచుకుంటున్నారు.

ట్విట్టర్ లో దర్బార్ సినిమాకు సంబంధించి ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా అదిరిపోయిందని ఎక్కువమంది ట్వీట్ చేశారు. ముఖ్యంగా మొదటి అర్థభాగం సినిమా ఒక రేంజిలో ఉందట. స్క్రీన్ప్లే సరికొత్తగా సాగిందని చాలామంది ట్వీట్ చేశారు. ఇది రజనీ సినిమా.. రజనీ వన్ మేన్ షో అని పేర్కొంటున్నారు. ఇక అనిరుద్ సంగీతంతో మాయ చేశాడని చెబుతున్నారు. రజనీ సినిమాల్లో ఆర్ ఆర్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. దానికి తగ్గట్టు అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఇచ్చాడని ప్రశంసిస్తున్నారు. ఇక సినిమా కథనం కొత్తదనంతో ఉందంటున్నారు. మొదటి అర్థ భాగం కథనం తో అదరగొట్టిన దర్శకుడు రెండో భాగంలో తన దర్శకత్వ ప్రతిభను చూపించారని అంటున్నారు. అందరూ సినిమాలో స్క్రీన్ ప్లే విషయంలో ఒకే మాట చెబుతున్నారు. చాలా బావుందని. అసలు సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిందని అందరూ ట్వీట్ చేస్తున్నారు.

''తలైవా వన్‌ మ్యాన్‌ షో. రజనీ ఎనర్జీ, స్టైల్‌, చరిష్మా అందరినీ ఇన్‌స్పైర్‌ చేసేలా ఉన్నాయి'' ఒక నెటిజన్ పేర్కొన్నారు. ఇంకా..ఈ సినిమా రూ.400-500 కోట్లు వసూలు చేయకపోతే సినీ అభిమానులకు టేస్ట్‌ లేదని అర్థం, జెట్‌ స్పీడ్‌ స్క్రీన్‌ ప్లే, ఒక్క సెకండ్‌ కూడా బోర్‌ కొట్టదు. కామెడీ, రొమాంటిక్‌, యాక్షన్స్‌ సీన్స్‌లో తలైవా అదరగొట్టాడు. విలన్‌ ఇంటర్వెల్‌కు ముందు రావడంతో అసలు ఆట ఆరంభవుతుంది. ఇలాంటి మాటలతో సినిమా సూపెర్ గా ఉందని అందరూ చెబుతున్నారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories