అసమాన సినీ ధీరుడు.. రజనీకాంత్!

అసమాన సినీ ధీరుడు.. రజనీకాంత్!
x
Highlights

చరిత్ర సృష్టించడం కొందరికే సాధ్యం. సృష్టించిన చరిత్రను సజీవంగా ఉంచడం చాలా తక్కువమంది వల్లే అవుతుంది. ఒక సామాన్యుసు అసామాన్యుడు గా ఎదగడం ఓ చరిత్ర.

చరిత్ర సృష్టించడం కొందరికే సాధ్యం. సృష్టించిన చరిత్రను సజీవంగా ఉంచడం చాలా తక్కువమంది వల్లే అవుతుంది. ఒక సామాన్యుసు అసామాన్యుడు గా ఎదగడం ఓ చరిత్ర. ఆ అసామాన్యుడు అదేవిధంగా దశాబ్దాల పాటు ప్రజల మనసులో నిలవడం అనేది ఆ చరిత్రకు దక్కే గౌరవం. ఆ చరిత్ర పేరు రజనీకాంత్. ఆ చరిత్రకు దక్కిన గౌరవం భారత దేశపు సూపర్ స్టార్ గా ప్రజల మదిలో స్థానం.

వ్యక్తులు శక్తులు అవడం చాలా సార్లు గమనిస్తుంటాం. విజయ పరంపరలో వారు అధిరోహించని శిఖరాలు లేవు అనే మాటా వింటూ ఉంటాం. కానీ అంతెత్తు ఎదిగినా ఒదిగి ఉండగలిగిన మానవ శిఖరాగ్రాన్ని రజనీకాంత్ లోనే చూడగలం.

సినిమా హీరోకి కావలసిన రంగు..శరీర సౌష్టవం.. ఇటువంటి హంగులేమీ లేవు అయన దగ్గర. కష్టించి పనిచేసే మనస్తత్వమే ఉంది. గుక్క తిప్పుకోకుండా మాట్లాడే వాక్చాతుర్యమూ లేదు అయన దగ్గర. కానీ, తన కోసం పరితపించే వాక్ల మనసులను రంజింపచేసే మానసిక పరిపూర్ణత్వం ఉంది అయన వద్ద.


ఎత్తూ పల్లాల జీవితంలో అంతెత్తున ఉన్నప్పుడూ ప్రజల మధ్య నిలబడ్డారు. పడిపోతున్నపుడూ వారి మనసులను అంటిపెట్టుకుని నిలిచారు. విజయానికి కొలమానం ఉండదు. అభిమానానికి అంతూ ఉండదు. రజనీ సూపర్ స్టార్ ఇమేజీకి కాలం కట్టుబడి ఉండిపోయింది.

టికెట్ల చిల్లర లెక్కేసుకునే చిన్న బస్సు కండెక్టర్.. కోట్ల రూపాయల వినోదాల టిక్కెట్లను హాట్ కేకుల్లా ప్రజలు ఎగరేసుకుపోయేలా చేయగలడంటే నమ్మలేం. కానీ, నమ్మకాలకు అందని ఎత్తుకు చేరి నిలబడ్డారు శివాజీ రావు గైక్వాడ్.

కుల,మతాలూ..ప్రాంతీయ బేధాలూ.. నువ్వూ నేనూ ఇలాంటి భిన్న సమ్మేళనాల భారతావనిలో.. అవన్నీ కావాలని కల్పించే అడ్డుగోడలు.. మన నడవడి బాగున్నపుడు, మనల్ని అభిమానించేవారు నమ్మకాన్ని వమ్ము చేయనప్పుడు ఆషేరు హిమాచలమూ ఆ మానవ మూర్తికి నీరాజనం పలుకుతుందని రుజువు చేసిన వారు సూపర్ స్టార్ రజనీకాంత్.


బెంగళూరులోని ఓ మరాఠీ కుటుంబంలో 1949 డిసెంబర్ 12 న పుట్టిన శివాజీరావు గైక్వాడ్.. ఈ డబ్బై సంవత్సరాల జీవన ప్రయాణంలో భారతావని మెచ్చే సూపర్ స్టార్ గా ఎదిగి అడిగారు రజనీకాంత్ గా.

బాలచందర్ అపూర్వ రాగంగళ్ చిన్న పాత్ర సినీజీవితానికి మొదటి పునాదిరాయి. ఆ రాయి మీద జారిపోయే పారిస్తాయి వచ్చినా..మళ్ళీ బాలచందర్ తీసిన తెలుగులో అంతులేని కథ..తమిళంలో అవర్ ఓరు తోడర్ కథై సినిమా అంతులేని అపారమైన అభిమాన రాశి వైపు రజనీ కాంత్ ని తీసుకుపోయింది. ఇక ఎక్కడా తిరిగి చూడకుండా..కాలాన్ని కూడా తన స్టైల్ తో కట్టి పడేశారు రజనీ కాంత్.

ఇక ఒక్కో సినిమాతోనూ భారతావనిని తన మేనియాతో ఊపేసిన రజనీ..ముత్తు సినిమాతో ఎల్లలు దాటేశారు. జపాన్ లో విడుదలైన ఈ సినిమా అక్కడ మరో రజనీ లోకాన్ని సృష్టించింది. అటు తరువాత బ్రిటన్, సౌదీ, అమెరికా ఇలా ఖండాన్తరాల్లో రజనీ బ్రాండ్ మేజిక్ చేసింది. ఇంకా చేస్తూనే ఉంది.


ఎదిగినా ఒదగడం అని చాలాసార్లు అంటాం. కానీ, దానికి నిలువెత్తు సాక్ష్యం ఈ సూపర్ స్టార్. సదా సీదాగా ఓ సాధారణ వ్యక్తిలా జీవించడం అయనకె చెల్లింది. చెప్పుకుంటూ పొతే చాలా ఉంది.. చెప్పాలంటే చెప్పలేనంత ఉంటుంది రజనీ కథ. భారత దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా కన్నా.. కోట్లాది అభిమాన ధనంతో తొడిగిన సూపర్ స్టార్ కిరీటమే రజనీని మిగిలిన స్టార్ లు అందరిలోకి ప్రత్యేకంగా నిలబెట్టింది.

ఈరోజు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న రజనీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతోంది HMTV .


HMTV లైవ్ నుంచి తాజా వార్తా విశేషాల కోసం TELEGRAM ను అనుసరించండి!



Show Full Article
Print Article
Next Story
More Stories