మహేష్ బాబు.. ది బిజినెస్ మేన్!

మహేష్ బాబు.. ది బిజినెస్ మేన్!
x
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్త వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి అడుగులు వేస్తున్నారు. ది హంబుల్‌ కో' పేరుతో బుధవారం కొత్త బ్రాండింగ్‌ ని మహేష్ బాబు ప్రారంభించారు. ఈ బ్రాండింగ్ వస్త్రాలని ఫ్యాషన్ రంగలో పేరొందిన స్పాయిల్ డాట్ ఇన్ ఆన్లైన మార్కెటింగ్ చేయబోతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇమేజి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ ఇమేజిని కమర్షియల్ గా వినియోగించుకోవడంలోనూ అందరికంటే మహేష్ ముందు వరుసలో ఉంటారు. అయన దాదాపు బాలీవుడ్ హీరోల లెవెల్ లో కమర్షియల్స్ చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే, ప్రస్తుతం మహేష్ డైరెక్ట్ గా ఆన్లైన్ వ్యాపార రంగం లోకి దూకారు. ఇప్పటికే మల్టీపెక్స్ రంగంలో దిగి దూసుకుపోతున్న ఈ స్టార్.. ఇప్పుడు సరికొత్త వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి అడుగులు వేస్తున్నారు. ది హంబుల్‌ కో' పేరుతో బుధవారం కొత్త బ్రాండింగ్‌ ని మహేష్ బాబు ప్రారంభించారు. ఇందులో అయన ఆలోచనలకు తగ్గట్టుగా వస్త్ర శ్రేణిని డిజైన్ చేశారు. ఈ బ్రాండింగ్ వస్త్రాలని ఫ్యాషన్ రంగలో పేరొందిన స్పాయిల్ డాట్ ఇన్ ఆన్లైన మార్కెటింగ్ చేయబోతోంది. చేనేత వస్త్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని మహేష్ బాబు తన ది హంబుల్ కో ని బుధవారం లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన తన అభిమాన కలర్స్.. డిజైన్స్ ఏమిటో చెప్పారు. తనకు బ్లూ కలర్‌ అంటే ఇష్టమని అందులోనూ చెక్స్‌ వుంటే మరీ ఇష్టపడతానని మహేష్‌ చెప్పారు. ఇక నుంచి తను పాల్గొనే ప్రతి ఫంక్షన్‌ కి తప్పకుండా 'ది హంబుల్‌ కో' బ్రాండ్‌ షర్ట్స్‌ నే ప్రిఫర్‌ చేస్తానని అన్నారు. సినిమాల్లో సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు వస్త్ర ప్రపంచంలోనూ దూసుకుపోతారని అభిమానులు సంబర పడుతున్నారు. అయినా, ఆయన చెప్పిన ఒక్క మాట చాలదటండీ.. అందరూ ఎగబడి ది హంబుల్ కో దుస్తులను కొనుక్కోవడానికి. ఏమంటారు?


Show Full Article
Print Article
More On
Next Story
More Stories