Mahesh Babu Fans Create Record in Twitter: ట్విట్టర్ లో ట్రెండ్ క్రియేట్ చేసిన మహేష్ ఫ్యాన్స్!

Mahesh Babu Fans Create Record in Twitter: సాధారణంగానే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానుల మధ్య పోటి ఉంటుంది. తమ స్టార్ ల సినిమాల కలెక్షన్ల విషయంలో పోటి పడుతుంటారు అభిమానులు..

Krishna
Published on: 27 July 2020 3:01 PM IST
Mahesh Babu Fans Create Record in Twitter: ట్విట్టర్ లో ట్రెండ్ క్రియేట్ చేసిన మహేష్ ఫ్యాన్స్!
X
Mahesh Babu Birthday Hashtag Top Trending in twitter

Mahesh Babu Fans Create Record in Twitter: సాధారణంగానే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానుల మధ్య పోటి ఉంటుంది. తమ స్టార్ ల సినిమాల కలెక్షన్ల విషయంలో పోటి పడుతుంటారు అభిమానులు.. కానీ ఓ నాలుగు నెలల నుంచి సినిమాలు లేకపోవడంతో ఇప్పుడు ట్విట్టర్లో రికార్డుల పైన కన్నేశారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఓ యాభై రోజులు ముందే అభిమానులు ట్విట్టర్ లో సందడి మొదలు పెట్టారు. #AdvanceHBDPawanKalyan హ్యాష్ ట్యాగ్‌తో 27 మిలియన్‌కు పైగా ట్వీట్స్‌తో ట్విట్టర్‌ను షేక్ చేశారు పవన్ అభిమానులు..

అంతకుముందు ఎన్టీఆర్ అభిమానులు #HappyBirthdayNTR హ్యాష్ ట్యాగ్‌తో 21.5 మిలియన్ ట్వీట్లు చేశారు. కానీ ఇప్పడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ వీటిని క్రాస్ చేస్తూ రికార్డు సృష్టించారు. #MaheshBabuBdayCDP అనే హ్యాష్ ట్యాగ్‌తో 24 గంటల్లో ఏకంగా 31 మిలియన్ ట్వీట్లు చేశారు. ఇండియన్ ట్విట్టర్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనితో మహేష్ అభిమానులకి అవధులు లేవని చెప్పాలి. ఇక మహేష్ బాబు ఆగస్టు 9న తన 45 పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.

ఇక మహేష్ సినిమాల విషయానికి వచ్చేసరికి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో మెప్పించిన మహేష్.. ప్రస్తుతం గీతా గోవిందం ఫేం పరుశురాంతో సర్కారు వారి పాట అనే సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.. బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, ఫ్రాడ్స్ వంటి విషయాల నేపథ్యంలో ఈ మూవీ కథ నడుస్తుందని తెలుస్తోంది

Krishna

Krishna

Next Story