Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఆఖరి చిత్రం ప్రేమ చరిత్ర కృష్ణ విజయం ట్రైలర్ లాంచ్

నట శేఖర్ కృష్ణ ప్రథమ జయంతి సందర్భంగా ఆయన నటించిన ఆఖరి చిత్రం ప్రేమ చరిత్ర కృష్ణ విజయం చిత్రం ట్రైలర్ ను ప్రసాద్ ల్యాబ్స్ లో ఆవిష్కరించారు.

Dhatripriya
Updated on: 1 Jun 2023 8:15 PM IST
Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఆఖరి చిత్రం ప్రేమ చరిత్ర కృష్ణ విజయం ట్రైలర్ లాంచ్
X

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఆఖరి చిత్రం ప్రేమ చరిత్ర కృష్ణ విజయం ట్రైలర్ లాంచ్

Super Star Krishna: నట శేఖర్ కృష్ణ ప్రథమ జయంతి సందర్భంగా ఆయన నటించిన ఆఖరి చిత్రం ప్రేమ చరిత్ర కృష్ణ విజయం చిత్రం ట్రైలర్ ను ప్రసాద్ ల్యాబ్స్ లో ఆవిష్కరించారు. యశ్వంత్, సుహాసిని జంటగా నటించిన ఈ చిత్రాన్ని అంబ మూవీస్ పతాకంపై మధుసూదన్ దర్శకత్వంలో శ్రీపాద్ హంచాటే నిర్మించారు. జూన్ లో విడుదలకు నోచుకుంటున్న నేపథ్యంలో ట్రైలర్ ను కృష్ణ మేకప్ మేన్ మాధవరావు చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

మధుసూదన్ దర్శకత్వంలో వస్తున్న ప్రేమ చరిత్ర కృష్ణ విజయం ట్రైలర్ ను చూశానని, కృష్ణ ఎంతో గ్లామర్ గా కనిపించారని మాధవరావు తెలిపారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేసిన మాధరరావు చిత్రాన్ని కృష్ణ అభిమానులు ఆదరించాలని కోరారు.

కృష్ణ జయంతి సందర్భంగా రీ రిలీజ్ చేసిన మోసగాళ్లకు మోసగాడు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోందని..ప్రేమ చరిత్ర కృష్ణ విజయం కూడా అదే రీతిలో విజయం సాధించాలని ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రేమచరిత్ర కృష్ణ విజయం చిత్రం 2007లో పూర్తైన విడుదలకు నోచుకోలేదని దీంతో నిర్మాతను అడిగి నేటి టెక్నాలజీకి అనుగుణంగా మార్పులు చేసి తానే స్వయంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు మధుసూదన్ తెలిపారు. కృష్ణ అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story