ఏకలవ్యుడిగా మారనున్న సందీప్ కిషన్

సంతోష్ జాగర్లమూడి.. సుమంత్ మరియు ఈషా రెబ్బ హీరోహీరోయిన్లుగా నటించిన 'సుబ్రమణ్యపురం' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంతోష్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించాడు.

Ruthvik
Published on: 15 Jan 2019 12:06 PM IST
Sundeep Kishan
X
Sundeep Kishan

సంతోష్ జాగర్లమూడి.. సుమంత్ మరియు ఈషా రెబ్బ హీరోహీరోయిన్లుగా నటించిన 'సుబ్రమణ్యపురం' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంతోష్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించాడు. కలెక్షన్ల పరంగా సినిమా పెద్దగా ఆడకపోయినా ప్రేక్షకుల నుండి మంచి టాక్ ని సంపాదించింది. సంక్రాంతి సందర్భంగా తన తరువాత ప్రాజెక్టు గురించి వివరాలను ప్రకటించారు సంతోష్. యువ హీరో సందీప్ కిషన్ గత కొంతకాలంగా కొత్తదనం ఉన్న కథలను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో సందీప్ సంతోష్ జాగర్లమూడి చెప్పిన కథను ఓకే చేశారు.

ఈ సినిమా మహాభారతంలోని ఏకలవ్యుడి పాత్రపై తెరకెక్కనుంది. ద్రోణాచార్యుడిని గురువుగా భావించి ఆయన విగ్రహం ముందు విద్య నేర్చుకున్న ఏకలవ్యుడు గురుదక్షిణగా తన బొటనవేలుని ఇస్తాడు. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ తో మోడర్న్ ఏకలవ్యుడి పాత్రలో సందీప్ కిషన్ కనిపించనున్నారు . ద్రోణాచార్యుడి పాత్రలో ఎవరు కనిపించనున్నారు? గురుదక్షిణగా సందీప్ ఏం ఇవ్వబోతున్నాడు? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

Ruthvik

Ruthvik

Next Story