మళ్ళీ అలాంటి సినిమాలు చేయనున్న యువ హీరో

మళ్ళీ అలాంటి సినిమాలు చేయనున్న యువ హీరో
x
Highlights

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన సినిమాల్లో 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' చాలా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా...

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన సినిమాల్లో 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' చాలా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాక సందీప్ కిషన్ కు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇక గత కొంత కాలంగా ఒక్క హిట్ కూడా లేక సతమతవుతున్నాడు సందీప్ కిషన్. ఈ మధ్యనే విడుదలైన 'నెక్స్ట్ ఏంటి' సినిమా కూడా డిజాస్టర్ గా మారింది. అందుకని ఈసారి ఒక కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేయాలని డిసైడయ్యాడు సందీప్ కిషన్.

తాజా సమాచారం ప్రకారం కామెడీ సినిమాల దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో హీరోగా సందీప్ ఒక సినిమా చేయనున్నాడని సమాచారం. ఈ సినిమాకు 'తెనాలి రామకృష్ణ బిఏబిఎల్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ తోనే ఈ సినిమా ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కర్నూలులో ఫిబ్రవరి 5వ తారీఖు నుండి మొదలవుతుంది. డిసెంబర్ లో విడుదల కానున్న ఈ సినిమాలో హన్సిక హీరోయిన్ గా నటించనుంది. ఎస్ ఎస్ ఎస్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories